ETV Bharat / bharat

వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం- ఆరుగురు మృతి - ట్రాక్టర్​ను ఢీకొట్టిన ట్రక్కు

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన చెరుకు లోడ్​ ట్రాక్టర్​ను ఓ మినీ పికప్​ ట్రక్కు ఢీకొట్టింది. మహారాష్ట్ర, ఔరంగాబాద్​ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లి.. తిరిగి వస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు.

pickup truck accident
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన పికప్​ ట్రక్కు
author img

By

Published : Dec 30, 2021, 11:24 AM IST

Updated : Dec 30, 2021, 2:30 PM IST

Pickup truck accident: మహారాష్ట్ర, ఔరంగబాద్​ జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకు లోడ్​తో ఉన్న ట్రాక్టర్​ను మినీ పికప్​ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

pickup truck accident
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన పికప్​ ట్రక్కు

జిల్లాలోని ఘట్​శేంద్ర గ్రామంలో బంధువుల వివహానికి హాజరై మినీ ట్రక్కులో బుధవారం రాత్రి స్వగ్రామం మంగ్రుల్​కు తిరిగి వస్తున్నారు. సిల్లోడ్​ తాలుకాలోని మోధా ఫటా సమీపంలో రోడ్డుపక్కన నిలిపిన చెరుకు లోడ్​ ట్రాక్టర్​ను గురువారం తెల్లవారుజామున 2 గంటలకు మినీ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. సిల్లోడ్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

pickup truck accident
చెరుకు లోడ్​తో ఉన్న ట్రాక్టర్​

మృతులు జిజాబాయి​ గణపత్ ఖేల్​వణే​(60), సంజయ్​ సంపత్​(42), సంగీత రతన్​(35), లక్ష్మీబాయి అశోక్​(45), అశోక్​ సంపత్​(52), రంజన(40)గా గుర్తించారు.

pickup truck accident
ఎగిరిపోయిన ట్రక్కు భాగాలు

ఇదీ చూడండి:

Last Updated : Dec 30, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.