PGCIL Trade Apprentice Jobs : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1045 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Engineer jobs in India : ప్రభుత్వ రంగ సంస్థ హరియాణా గుడ్‌గావ్‌లోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
పీజీసీఐఎల్ రీజియన్స్ వారీగా పోస్టుల వివరాలు
- కార్పొరేట్ సెంటర్ (గుడ్‌గావ్) - 53
- నార్తెర్న్ రీజియన్ 1 (ఫరీదాబాద్) - 135
- నార్తెర్న్ రీజియన్ 2 (జమ్ము) - 79
- నార్తెర్న్ రీజియన్ 3 (లఖ్‌నవూ) - 93
- ఈస్ట్రన్ రీజియన్ 1 (పట్నా) - 70
- ఈస్ట్రన్ రీజియన్ 2 (కోల్‌కతా) - 67
- నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్) - 115
- ఒడిశా ప్రాజెక్ట్స్ (భువనేశ్వర్) - 47
- వెస్ట్రన్ రీజియన్ 1 (నాగ్‌పుర్) - 105
- వెస్ట్రన్ రీజియన్ 2 (వడోదర) - 106
- సదరన్ రీజియన్ 1 (హైదరాబాద్) - 70
- సదరన్ రీజియన్ 2 (బెంగళూరు) - 105
అప్రెంటీస్‌షిప్ ట్రేడ్ విభాగాలు
PGCIL Engineering Jobs : గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ - ఎలక్ట్రీషియన్, డిప్లొమా (ఎలక్ట్రీషియన్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్
విద్యార్హతలు ఏమిటి?
ఆయా విభాగాలను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ క్యాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి వివరాలు
అభ్యర్థుల కనిష్ఠ వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి ఆయా పోస్టులకు అనుగుణంగా మారుతుంది. అయితే రిజర్వేషన్లు ప్రకారం కేటగిరీల వారీగా వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము
పీజీసీఐఎల్ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణా కాలం
Engineer Job Training : ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
స్టైఫండ్
ఆయా ట్రేడ్ విభాగాలను అనుసరించి నెలకు రూ.13,500 నుంచి రూ.17,500 వరకు స్టైఫండ్ ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
PGCIL Apprentice Selection Process : అభ్యర్థుల అకడమిక్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- పీజీసీఐఎల్ ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ : 2023 జులై 1
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 1
- దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 జులై 31