యజమాని కుటుంబాన్ని తాచు పాము నుంచి కాపాడిన ఓ పిల్లి సూపర్‌హీరోగా నిలిచింది. ఒడిశా భువనేశ్వర్‌లోని బీమతాంగి ప్రాంతంలో నివసిస్తున్న సంపద్ కుమార్ పెరట్లోకి నాగు పాము ప్రవేశించింది. ఇంటి వెనుక నుంచి వస్తున్న పామును గుర్తించిన పెంపుడు పిల్లి చిన్నూ దాన్ని పెరట్లోనే అడ్డుకుంది. చిన్నూ అడ్డుగా నిలవగా.. ఆ సర్పం పదే పదే బుసలు కొట్టింది. అయినా కదలకుండా అడ్డుతగిలిన చిన్నూ.. ఆ విషనాగుకు ఎదురు తిరిగింది. భయపెట్టాలని తాచు పడగ విప్పినా.. ఏడాదిన్నర వయస్సు ఉన్న పిల్లి ఏమాత్రం బెదరకుండా అక్కడే కూర్చుంది.
ఆ దగ్గర్లోనే ఉన్న కుక్క అరుపులు విని కిందకు వచ్చిన సంపద్.. పాము, పిల్లిని చూసి ఆశ్చర్య పోయాడు. స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు. స్నేక్ వలంటీర్ అరుణ్ కుమార్ ఇంటికి వచ్చే వరకు పామును ఆ పిల్లి నిలువరించింది. వలంటీర్ ఆ సర్పాన్ని పట్టుకుని నగరం బయట ఉన్న అటవీ ప్రదేశంలో వదిలేశాడు. అయితే రెండింటి మధ్య పోరు జరిగిన సమయంలో.. పిల్లికి ఏదైనా కాటు పడిందేమో తెలుసుకునేందుకు దానికి పరీక్షలు చేయించారు. కానీ చిన్నూ సురక్షితంగా ఉన్నట్లు స్నేక్ హెల్ప్‌లైన్ అధికారులు చెప్పారు. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని కాపాడిన పిల్లిని కుటుంబ సభ్యులు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
ఇదీ చూడండి : Viral video: నదిలో కొట్టుకుపోయిన తాగుబోతు!