ETV Bharat / bharat

'టీకాల కోసం లైన్లలో ప్రజలు.. ప్రణాళికే లేని ప్రభుత్వం'

కరోనా వ్యాక్సిన్​కు ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని ప్రభుత్వం లోక్​సభకు తెలపటంపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని, వ్యాక్సిన్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్​ చేశారు.

Rahul on vaccination
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jul 24, 2021, 10:51 PM IST

కరోనా టీకాల పంపిణీలో ఎలాంటి కాల వ్యవధి లేదని ప్రభుత్వం తెలపటాన్ని సూచిస్తూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.

వ్యాక్సిన్లు ఎక్కడ ఉన్నాయో వెల్లడించాలని, ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ట్వీట్​ చేశారు రాహుల్​.

"ప్రజల జీవితాలు లైన్లలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఎలాంటి టైమ్​ లైన్​ లేదని ఒప్పుకుంది. ప్రభుత్వానికి ధైర్యం లేదని స్పష్టమవుతోంది. "

- రాహుల్​ గాంధీ.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో టీకా పంపిణీని పూర్తి చేసేందుకు ఒక నిర్దిష్ట గడువు అంటూ ఏమీ నిర్ణయించలేదని లోక్​సభకు ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజున ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. అయితే.. 18 ఏళ్లు, ఆపై వయసు వారికి 2021 డిసెంబర్​ నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ అందుతుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

'మోదీ ప్రభుత్వ అబద్ధాలు బయటపడ్డాయి..'

టీకా పంపిణీపై రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానంతోనే మోదీ ప్రభుత్వ అబద్ధాలు బయటపడ్డాయని విమర్శించారు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. వ్యాక్సినేషన్​పై ఇన్నాళ్లు చెప్పినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'పెగాసస్​తో రాజద్రోహానికి పాల్పడ్డ ప్రభుత్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.