ETV Bharat / bharat

కమల్​ నోట హంగ్​ మాట- ప్రజలకు కీలక సూచన - కమల్​ హాసన్​ నామినేషన్​

తమిళనాడులో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు ఎంఎన్​ఎం పార్టీ అధినేత కమల్​ హాసన్​. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు అధికారం చేపట్టే అర్హత లేదని, ఎన్నికల ఫలితాల్లో హంగ్​ ఏర్పకుండా ప్రజలే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు.

People should make decisive move, not to leave hung Assembly: Kamal Haasan
ప్రజలే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి: కమల్​ హాసన్​
author img

By

Published : Mar 22, 2021, 10:50 AM IST

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో హంగ్​ ఏర్పడకుండా చూడాలని అక్కడి ఓటర్లను కోరారు మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) అధినేత కమల్​ హాసన్. ​

"ఆ రెండు పార్టీలు(ఏఐఏడీఎంకే, డీఎంకే) ప్రజల మద్దతు పొందేందుకు అర్హమైనవి కావు. ప్రజలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. హంగ్​ ఏర్పడకుండా చూడాలి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

నేను పేదల ఉన్నతి కోసం పని చేయాలనుకుంటున్నా. రాజ్యాంగానికి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకోవడమే నా లక్ష్యం."

- కమల్ హాసన్​, ఎంఎన్ఎం అధినేత

ఆ స్థానం నుంచే పోటీ ఎందుకంటే.?

కోయంబత్తూర్‌ను తమిళనాడులోనే కాకుండా దేశంలోనే ఉత్తమ నగరంగా తయారు చేయడానికి కృషి చేస్తానన్నారు కమల్​. దక్షిణ కోయంబత్తూర్​ నియోజకవర్గం​ నుంచి బరిలోకి దిగిన ఆయన​.. నిజాయితీయే తన పార్టీ వ్యూహమని, ఇతర పార్టీల్లో అది లేదన్నారు. కోయంబత్తూర్​ నుంచి పోటీ చేయడానికి కారణమేంటని ప్రశ్నించగా.. తనకు ఆ ప్రాంతంతో దగ్గర సంబంధం ఉందని, అక్కడ చాలా మంది స్నేహితులున్నారని పేర్కొన్నారు. తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలకు కోయంబత్తూర్​ వేదికైందని చెప్పారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్​ ఇండియా సమథువ మక్కల్​ కట్చి(ఏఐఎస్​ఎంకే), ఇండియా జననాయగ కట్చి(ఐజేకే)తో కలసి కూటమిగా పోటీ చేస్తోంది కమల్ పార్టీ. 234 స్థానాలకు గానూ 154 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మిగతా 80 స్థానాల్లో మిత్ర పక్షాలకు చెరో 40 సీట్లు కేటాయించింది.

ఇదీ చూడండి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.