కేంద్రం చెప్పే మాటలకు, చేతలకు సంబంధం లేదని అసోం ప్రజలకు అర్థమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భాజపా ప్రభుత్వం కేవలం వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తోందని, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు.
"రోజువారీ కూలీలు, టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న వారి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? కేంద్రం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదని ప్రజలకు అర్థమైంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
అసోంలో ఏప్రిల్ 1న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : 'కేరళలో ఆ రెండు కూటముల మ్యాచ్ ఫిక్సింగ్'