దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్న వేళ.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ధరల పెరుగుదల (Price rise in India) గురించి ప్రజలు ఫిర్యాదులు చేయకూడదని, ప్రభుత్వాలు ప్రజలకు అన్ని వస్తువులను ఉచితంగా ఇవ్వలేదని మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా (Mahendra Singh Sisodiya mantri) పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆదాయాలు పెరిగాయని.. అలాంటప్పుడు ధరలు (Price rise in India) పెరిగితే తప్పేంటని ప్రశ్నించారు.
తమ ఆదాయం పెరిగినప్పుడు.. ద్రవ్యోల్బణాన్నీ (Price rise in India) ప్రజలు స్వీకరించాలని సిసోడియా చెప్పుకొచ్చారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా వర్గంతో కలిసి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన ఆయన.. యూపీఏ హయాంలోనూ ధరల పెరుగుదల సమస్య ఉండేదని గుర్తు చేశారు.
"సాధారణ ప్రజల ఆదాయం పెరగలేదా? గతంలో రూ.5,000 సంపాదించేవాళ్లు ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నారు. పదేళ్ల క్రితం రూ.6,000 వేలు సంపాదించేవారు ఇప్పుడు.. రూ.50 వేలు సంపాదిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం పెట్రోల్, డీజిల్‌లు పాత రేట్లకే లభించాలని అనుకుంటున్నారు. ధరల పెరుగుదల వల్ల కూరగాయలు, పాలు విక్రయించేవారికి మెరుగైన ఆదాయం లభిస్తోంది కదా? ఇదో చట్రం లాంటిది. దీన్ని స్వీకరించాల్సిందే."
-మహేంద్ర సింగ్ సిసోడియా, మధ్యప్రదేశ్ మంత్రి
మంత్రి వ్యాఖ్యలపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోజురోజుకూ రికార్డు స్థాయికి..
దేశంలో నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం వరుసగా ఆరోరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకంతో కేంద్రం భారీగా వెనకేసుకుంటోంది. కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే 79 శాతం అధికంగా ఎక్సైజ్ సుంకం వసూలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: