ETV Bharat / bharat

'బిహార్​ సీఎం ఎవరనేది ఎన్డీఏ నిర్ణయిస్తుంది' - బిహార్​ ఎన్డీఏ

సీఎం పదవిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ తెలిపారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.

Bihar CM Nitish Kumar
'బిహార్​ సీఎం ఎవరనేది ఎన్డీఏ నిర్ణయిస్తుంది'
author img

By

Published : Nov 12, 2020, 8:02 PM IST

బిహార్​లో ముఖ్యమంత్రి పదవిపై తాను ఎలాంటి ప్రకటన చేయలేదని సీఎం నితీశ్​ కుమార్​ స్పష్టం చేశారు. ఎన్డీఏ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు నితీశ్​. సంకీర్ణ భాగస్వామిగా ఎన్డీఏతో కలిసి పనిచేయడమే తమ విధానమని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్​ యునైటెడ్​(జేడీయూ)కు ఓట్ల నష్టం కలిగించిన లోక్​ జన్​ శక్తి(ఎల్​జేపీ).. ఎన్డీఏలో ఉండేదానిపై కూడా నిర్ణయించాల్సింది భాజపాయేనని చెప్పారు నితీశ్. సీఎం పదవికి తాను దూరంగా ఉండాలంటూ రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్​ డిమాండ్​ చేయడం.. అది ఆయన అభిప్రాయమేనని నితీశ్​ అన్నారు.

"ముఖ్యమంత్రి పదవిపై నేను వ్యాఖ్యలు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఎన్డీఏ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. సీఎం పదవిపై ఎవరైనా నన్ను అడిగితే నేనేమీ చెప్పను. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోరిక లేదు. మేం ఎన్డీఏతో మేం కలిసి, ప్రజల మధ్య పని చేస్తున్నాం."

- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: సోమవారమే సీఎంగా నితీశ్​ ప్రమాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.