దేశంలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతోన్న తరుణంలో మధ్యప్రదేశ్ మంత్రి ప్రేమ్‌సింగ్ పటేల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మనుషులన్నాక ముసలివాళ్లు అవుతారని, ఆ తరువాత చనిపోవాల్సి ఉంటుందన్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలపై అడిగిన ప్రశ్నకు.. మంత్రి ఈ విధంగా స్పందించారు.
''మరణాలు సంభవించాయని నేను అంగీకరిస్తున్నాను. వాటిని ఎవరూ ఆపలేరు. ప్రజలు మాస్కులు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రజలు వైద్యులను సంప్రదించాలి. మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ప్రజలు చనిపోతున్నారని చెప్తున్నారు. విషయం ఏంటంటే.. వయసు మీద పడినవారు చనిపోవాలి''.
-ప్రేమ్‌సింగ్ పటేల్, మధ్యప్రదేశ్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో గురువారం 9,720 మందికి కరోనా సోకగా.. 51 మంది మరణించారు. అయితే కొవిడ్ మరణాల విషయంలో ప్రభుత్వ గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు అంతరం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. శ్మశాన వాటికల్లో స్థలం లేక, అంత్యక్రియల కోసం మృతుడి బంధువులు వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించాయి.
ఇదీ చదవండి: ఆక్సిజన్ తొలగించిన వార్డ్ బాయ్- కొవిడ్ రోగి మృతి!