ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త - లైఫ్​ సర్టిఫికెట్​

పింఛనుదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2021 ఫిబ్రవరి 28కి పొడగించింది.

Pensioners can submit life certificates till Feb 28: Union Minister Jitendra Singh
పింఛన్‌దారులకు కేంద్రం శుభవార్త
author img

By

Published : Dec 20, 2020, 8:53 PM IST

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పింఛనుదారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పణ తేదీని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు. దీంతో కరోనా వైరస్‌ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన పింఛనుదారులకు ఊరట లభించనుంది.

బయోమెట్రిక్​ పరికరాలు ఉంటే ఇంటి నుంచే లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించవచ్చని మంత్రి తెలిపారు. ఇండియన్​ పోస్టల్​ పేమెంట్స్​ బ్యాంక్​ సహకారంతోనూ జీవన ప్రమాణ పత్రం పొందవచ్చని సూచించారు.

"పెన్షనర్లు బ్యాంకుల వద్ద గుమికూడతారు. ఈ కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. 80ఏళ్లు పైబడిన వారు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు ప్రత్యేక విండోను కూడా ఏర్పాటు చేశాం."

-జితేంద్ర సింగ్​, కేంద్రమంత్రి

ఇదీ చూడండి: ప్రపంచంలోనే అతిపెద్ద జూ నిర్మిస్తున్న రిలయన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.