ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడం వల్ల ఒక పేషెంట్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అమేఠీ జిల్లాలోని జగదీశ్పుర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. చికిత్స అనంతరం ఔట్ పేషెంట్ వార్డు నుంచి బయటకు వస్తుండగా.. పేషెంట్ ఒక్కసారిగా జారి కిందపడిపోయాడు. కనీసం స్ట్రెచర్ సదుపాయం కూడా లేకపోవడం వల్ల.. ఆ పేషెంట్‌ను కుటుంబ సభ్యుల ఎత్తుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయంకేశ్వర్ శరణ్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ఆస్పత్రుల పరిస్థితుల గురించి ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రదీప్ తివారీని ప్రశ్నించగా.. స్ట్రెచర్ కొరత ఆస్పత్రిలో లేదని.. పేషెంట్లు స్ట్రెచర్ తీసుకోకుంటే మేము ఏం చేస్తాం అని బదులిచ్చారు.
ఇవీ చదవండి : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి.. కూలీకి వెళ్లి వస్తూ ఏడుగురు మహిళలు..