ETV Bharat / bharat

Patanjali Oil Palm Plantation : అసోంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ మొక్కలు పెంపకం.. కీలక పాత్ర పోషిస్తున్న పతంజలి! - ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పామ్ ఆయిల్

Patanjali Oil Palm Plantation Assam : ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి.. అసోం రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగమైంది. అసోం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పరమ పూజ్యులు స్వామి రామ్​దేవ్ బాబా స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

patanjali palm oil plantation
patanjali palm oil plantation
author img

By

Published : Aug 9, 2023, 10:55 PM IST

Updated : Aug 10, 2023, 9:12 AM IST

Patanjali Oil Palm Plantation Assam : ఆయుర్వేద రంగంలో విశేష కృషి చేస్తున్న పతంజలి సంస్థ.. అసోంలోని తీన్​సుకియా గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగమైంది. ఆయిల్ పామ్ సాగు విషయంలో ఈశాన్య రాష్ట్ర దశాదిశను మార్చేందుకు అసోం ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 'ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్' పేరుతో 2023 ఆగస్టు 8న ఈ కార్యక్రమం నిర్వహించారు.

patanjali palm oil plantation
వేదికపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో బాబా రాందేవ్​

గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి 2021 ఆగస్టులో ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్​పై జాతీయ మిషన్​ను లాంఛ్ చేశారు. దేశంలో ఆయిల్ పామ్ సాగవుతున్న విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మరిన్ని అవకాశాలు అందేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తూ ఈ మిషన్​ను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆయిల్ పామ్ మిషన్ విజయవంతమైన నేపథ్యంలో అసోం వ్యవసాయ శాఖ.. 'జాతీయ స్థాయి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్' చేపట్టింది. 2023 జులై 25 నుంచి ఆగస్టు 5వరకు ఈ డ్రైవ్ కొనసాగింది. స్థానిక రైతులకు అవగాహన కల్పించి, ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

patanjali palm oil plantation
వేదికపై బాబా రాందేవ్

ఆయిల్ పామ్ మొక్కల పెంపకంలో గణనీయమైన అనుభవం ఉన్న పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) ఈ మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్​లో పాల్గొంది. దేశవ్యాప్తంగా 64 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఈ రంగంలో అగ్రగామిగా పతంజలి నిలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ సాగు కంపెనీల్లో ఒకటిగా ఉన్న పతంజలి.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మొక్కల పెంపకం చేపడుతోంది. ఈ ప్లాంటేషన్ డ్రైవ్​లు ఆరు రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో ఉన్న 14 బ్లాకులలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అరుణాచల్​ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇదే విధంగా సెరేమోనియల్ ప్లాంటేషన్​లో భాగంగా 20 హెక్టార్లలో 3వేల మొక్కలను నాటారు. ప్లాంటేషన్ వేడుకలకు హాజరైన అతిథులు వీటి పంపిణీ చేపట్టారు. 9 రోజుల పాటు జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో 1200కు పైగా హెక్టార్లలో 1.80 లక్షల మొక్కలను నాటారు. ఆరు రాష్ట్రాల్లోని 800 మంది రైతులకు ఈ మొక్కలను పంపిణీ చేశారు.

patanjali palm oil plantation
పామ్ ఆయిల్ మొక్కలు నాటుతున్న బాబా రాందేవ్

ఇందులో భాగంగా ఆగస్టు 8న జరిగిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్​లో పీఎఫ్ఎల్ భాగమైంది. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరమ పూజ్యులైన స్వామి రామ్​దేవ్ బాబా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు తీన్​సుకియా జిల్లా కమిషనర్, అటవీ, రెవెన్యూ అధికారులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి 4,500 మంది రైతులు హాజరయ్యారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, పరమపూజ్యులైన స్వామి రామ్​దేవ్ ఇతర ప్రముఖులు.. ఒక హెక్టార్ విస్తీర్ణంలో మొక్కలు నాటారు. జిల్లాలో గుర్తింపు పొందిన 25 మంది రైతులకు 2,800కు పైగా మొక్కలు పంపిణీ చేశారు.

patanjali palm oil plantation
హిమంత బిశ్వశర్మతో బాబా రాందేవ్​

అసోంలో ఆయిల్ పామ్ సాగుకు అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో.. అసోం ప్రభుత్వం, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ తమ ఎంఓయూ ద్వారా ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రైతుల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఆయిల్ పామ్​ సాగును ముందుకు తీసుకెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ఈ కంపెనీకి ఏడు జిల్లాలను కేటాయించారు.

పతంజలి ఫుడ్స్ లిమిటెడ్.. ఆయిల్ పామ్ మొక్కల పెంపకంలో విశేషమైన ఫలితాలు సాధిస్తోంది. ఈ సంస్థకు 155 గంటకు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఐదు మిల్లులు ఉన్నాయి. ఏటా రైతుల నుంచి 5-6 లక్షల మిలియన్ టన్నుల తాజా ఆయిల్ పామ్ గింజలను పతంజలి సేకరిస్తోంది. 2027-28 నాటికి 12 రాష్ట్రాల్లో 2.50 లక్షల హెక్టార్లకు ఈ పంట విస్తీర్ణాన్ని పెంచాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫలితాలు దేశంలో ఎడిబుల్ ఆయిల్​ రంగంలో కంపెనీని అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. దీర్ఘకాలంలో దేశ ఆయిల్ దిగుమతులు తగ్గించి ఆత్మనిర్భర భారత్ అనే కలను సాకారం చేసేందుకు తోడ్పడతాయి.

Last Updated : Aug 10, 2023, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.