ETV Bharat / bharat

గొడుగులు వేసుకొని రైలు ప్రయాణం.. ఎక్కడ? ఎందుకో తెలుసా? - panchavati express passengers umbrellas

సాధారణంగా రైల్వే ప్రయాణం సురక్షితమని భావించి.. చాలామంది రైలులోనే ప్రయాణిస్తుంటారు. కానీ, ముంబయి నుంచి నాసిక్​ వెళ్లే పంచవటి రైలులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఈ రైలులో ప్రయాణించాలంటే తప్పకుండా గొడుగు తీసుకెళ్లాల్సి వస్తోంది. అదేంటి గొడుగు ఎందుకు అనుకుంటున్నారా? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

passengers-have-to-travel-with-umbrellas-in-ac-coaches-of-panchvati-express

author img

By

Published : Jul 27, 2022, 7:56 AM IST

కరోనా మహమ్మారి.. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని శాసించింది. వైరస్​ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్​డౌన్​ నేపథ్యంలో మన దేశంలో కూడా అనేక రైళ్లను నిలిపివేశారు రైల్వే అధికారులు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కో రైలును ప్రారంభిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే కొన్ని నెలల పాటు నిలిచిపోయిన ముంబయి నుంచి నాసిక్​ వెళ్లే పంచవటి రైలు తాజాగా ప్రారంభమైంది.

Passengers have to travel with umbrellas in AC coaches of Panchvati Express
గొడుగులతో ప్రయాణికులు

అయితే ఈ రైలులోని ఏసీ బోగీలో ప్రయాణం.. ప్యాసింజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల.. ఏసీ బోగీలో నీరు లీకై ప్రయాణికుల మీద పడుతోంది. దీంతో గత్యంతరం లేక గొడుగులు వేసుకుని ప్రయాణిస్తున్నారు ప్యాసింజర్లు. ఈ క్రమంలో కొందరు.. ఆ ఫోటోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసి రైల్వేశాఖను నిలదీస్తున్నారు. రూ.4 వేలు పెట్టి టికెట్లు కొని ప్రయాణం చేస్తుంటే కనీస సౌకర్యం కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: 'ఒక్క రూపాయి డాక్టర్‌' కన్నుమూత.. మోదీ, దీదీ సంతాపం

సైన్యానికి కొత్త శక్తి... రూ.28,732 కోట్ల ఆయుధాల కొనుగోలుకు గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.