భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఏంతో మంది పోరాటాలు, త్యాగాలు చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంనేదుకుగానూ.. ఆగస్టు 14వ తేదీని విభజన విషాద సంస్మరణ దినంగా పాటించాలని మోదీ అన్నారు. విభజన బాధ ఎన్నటికీ మరువలేమని తెలిపారు.
విభజన నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలు ఒకచోటు నుంచి మరోచోటుకు తరలి వెళ్లారని అన్నారు. విభజనతో వచ్చిన ద్వేషం, హింస కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయినట్లు గుర్తు చేశారు.
1947లో బ్రిటీష్ పరిపాలన ముగిసిన తరువాత భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి.. వేరే దేశంగా అవతరించింది.దీంతో పాక్ ముస్లిం దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం వల్ల లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. అనేక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.