ETV Bharat / bharat

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ప్రస్తుత భవనంలో చివరివి! - వర్షాకాల సమావేశాలు

Parliament monsoon session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. లోక్​సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి.

parliaments-monsoon-session
జులై 18 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు
author img

By

Published : Jun 30, 2022, 9:02 PM IST

Updated : Jul 1, 2022, 6:58 PM IST

Parliament session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని లోక్​సభ, రాజ్యసభ సచివాలయాలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్​ చివరిసారిగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు సమావేశమైంది.

మొత్తం 18 సిట్టింగ్​ల్లో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు భారత రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు. ఆగస్టు 6 ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్​లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ కుదిరితే వర్షాకాల సమావేశాల తర్వాత జరిగే సెషన్లు.. నూతన భవనంలోనే జరిగే అవకాశం ఉందని సమాచారం.

Last Updated : Jul 1, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.