సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, గూగుల్ సంస్థలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడం సహా వినియోగదారుల హక్కుల భద్రతలపై చేపడుతున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ప్యానెల్ ఎదుట హాజరవ్వాలని సంబంధిత సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేసింది.
అంతకుముందు జూన్ 18న స్టాండింగ్ కమిటీ ట్విట్టర్‌కు ఇదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
కొత్త ఐటీ రూల్స్ సామాన్యుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవే అని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 26 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
ఇవీ చదవండి :