పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ సమావేశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను.. కమిటీ ఛైర్మన్ జువెల్ ఓరం ఖండించారు. ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
అధికారిక వర్గాల ప్రకారం.. జువెల్ ఓరం గురువారమే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్యానెల్ భేటీ నుంచి రాహుల్ గాంధీ వాకౌట్ చేసేందుకు దారితీసిన పరిణామాలను వివరించారు. రాహుల్ భేటీకి ఆలస్యంగా హాజరై.. చర్చ మధ్యలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ భేటీకి అజెండాను ఖరారు చేసే సమావేశానికీ రాహుల్ హాజరు కాలేదన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.