ETV Bharat / bharat

సభకు 'లఖింపుర్​' సెగ- నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్

Parliament winter session: లఖింపుర్​ ఖేరి ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్​ అట్టుడికింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్​తో నిరసనలతో హోరెత్తించారు విపక్ష సభ్యులు. దీంతో ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

Parliament
పార్లమెంట్​లో ఆందోళనలు
author img

By

Published : Dec 16, 2021, 3:31 PM IST

Parliament winter session: లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై గురువారం పార్లమెంట్​ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వ కొనసాగింది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

లోక్​సభలో..

Lok Sabha adjourned today: లోక్​సభ ప్రారంభమయిన తర్వాత.. తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు నివాళులర్పించారు సభ్యులు. కొద్ది క్షణాల పాటు మౌనం పాటించి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత లఖింపుర్​ ఖేరి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ.. లోక్​సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. తృణమూల్​ కాంగ్రెస్​ సహా విపక్ష నేతలు స్పీకర్​ వెల్​లోకి దూసుకెళ్లారు.

Lok Sabha
లోక్​సభలో విపక్ష సభ్యుల ఆందోళనలు

విపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓంబిర్లా. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వగా.. అజయ్​ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. ఆయన ఓ నేరస్థుడని, లఖింపుర్​ ఘటనతో ఆయనకు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. అయితే, ఎంఎస్​ఎంఈ రంగానికి సంబంధించి అడిగిన ప్రశ్నకే పరిమితం కావాలని రాహుల్​కు స్పీకర్​ సూచించారు. కానీ, రాహుల్​ తన డిమాండ్​ను కొనసాగించటం.. సభలో గందరగోళానికి దారి తీసింది. విపక్షాల నినాదాలతో కార్యకలాపాలను మొదట మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. లఖింపుర్​ ఖేరి ఘటన, సిట్​ నివేదికపై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభాకార్యకలాపాలు కొనసాగే పరిస్థితులు కనిపించక.. శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

రాజ్యసభలో..

Rajya Sabha adjourned: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే.. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా రాజీనామాకు డిమాండ్​ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఆయన కుమారుడు ఆశిష్​ మిశ్రా ఈ ఘటనలో నిందితునిగా ఉన్న నేపథ్యంలో మంత్రిగా కొనసాగే అర్హత అజయ్​ మిశ్రాకు లేదని ఆరోపించారు. నినాదాలతో కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండటం వల్ల మొదట సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

Rajya sabha
రాజ్యసభలో నిరసనలు

తిరిగి ప్రారంభమైన తర్వాత సైతం విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. లఖింపుర్​ ఘటనపై చర్చ చేపట్టాలని డిమాండ్​ చేస్తూ నిరసనలతో హోరెత్తించారు విపక్ష సభ్యులు. దీంతో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.

ప్రధాని రక్షణగా ఉన్నారనే చెప్పాలి: ఖర్గే

లఖింపుర్​ ఖేరి ఘటనపై రాజ్యసభలో 267 నిబంధన ప్రకారం నోటీసులు ఇచ్చామని, ఆ ఘటనపై చర్చ చేపట్టాలని డిమాండ్​ చేశారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్​ ఖర్గే. ముఖ్యంగా లఖింపుర్​ ఘటన కుట్రపూరితంగా, ప్రణాళికతో చేసిందన్న సిట్​ నివేదికపై చర్చించాలన్నారు.

"ఛార్జిషీట్​ను పోలీసులు అప్డేట్​ చేశారు. సుప్రీం జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది. కేంద్ర మంత్రి కుమారుడికి ఇందులో సంబంధం ఉంది. అతనే కుట్రదారు. 13 మంది స్నేహితులతో కలిసి రైతులను హత్య చేశాడు. సభ ముందుకు ఈ అంశాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. ఈ రోజు ఉదయం నోటీసులు ఇచ్చాం. ఒక సమయం ఆందోళనలు విరమించాలని లేదంటే దానిని 2 నిమిషాల్లో ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని మంత్రి రైతులతో పేర్కొన్నారు. ఆయన కుమారుడు చేసింది అదే కావచ్చు. ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. సిట్​ నివేదిక వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. ఆయనకు ప్రధాని భద్రత కల్పిస్తున్నారనే చెప్పాలి. మా అభ్యర్థనను ఛైర్మన్​ పట్టించుకోవటం లేదు. ఆకస్మికంగా సభను వాయిదా వేశారు. "

- మల్లికార్జున్​ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.

ఇదీ చూడండి:

పార్లమెంట్​లో లఖింపుర్​ రగడ- మంత్రి రాజీనామాకు విపక్షాల డిమాండ్

'సేంద్రియ సాగుతోనే రైతు ఇంట సిరుల పంట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.