ETV Bharat / bharat

విపక్షాల నిరసనల మధ్యే లోక్​సభ.. రేపటికి వాయిదా - lok sabha live

Parliament winter session live updates
7వ రోజుకు చేరిన పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు
author img

By

Published : Dec 7, 2021, 11:01 AM IST

Updated : Dec 7, 2021, 8:53 PM IST

20:27 December 07

లోక్​సభ రేపటికి వాయిదా..

లోక్​సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగాయి.

15:27 December 07

రాజ్యసభ రేపటికి వాయిదా..

విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం అసలు సభ కార్యకలాపాలు జరగలేదు.

14:26 December 07

రాజ్యసభ మళ్లీ వాయిదా..

రాజ్యసభలో 7వ రోజూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12మంది ఎంపీలపై ఉన్న సస్పెన్షన్​ను రద్దు చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఉదయం 11:10కి సభ వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు మొదలైంది. విపక్షాల మళ్లీ నిరసన చెపట్టాయి. ఈసారి పెద్దల సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.

12:14 December 07

రైతు మరణాలపై

లోక్​సభ వేదికగా.. ప్రభుత్వంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ విరుచుకుపడ్డారు.

"నిరసనల్లో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశానికి, దేశంలోని రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. తప్పుచేశానని ఆయనే అంగీకరించారు. ఇప్పుడేమో.. రైతుల మరణంపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఏంటిది? 400మంది రైతులకు పంజాబ్​ ప్రభుత్వం రూ. 5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. 152మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా దగ్గర లిస్టు ఉంది. ప్రభుత్వం మాత్రం డేటా లేదు అంటోంది. రైతుల హక్కులు.. రైతులకు ఇవ్వాలి. వారికి ఉద్యోగాలివ్వాలి. ఇదే మా డిమాండ్​"

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

11:06 December 07

రాజ్యసభ వాయిదా

ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. 12మంది ఎంపీల సస్పెన్ష్​ను తొలగించాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. భారీ ఎత్తున నినాదాలు చేశాయి. కార్యకలాపాలు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్నాయి.

మరోవైపు విపక్షాల నిరసనల మధ్య లోక్​సభలో జరుగుతోంది.

10:45 December 07

7వ రోజుకు చేరిన పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు 7వ రోజుకు చేరాయి. ఉభయ సభల ముందు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి.

సోమవారం నాడు.. నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటన చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సిట్​తో దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

అమిత్​ షా ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్​సభలో విపక్షాలు వాకౌట్​ చేశాయి. మరోవైపు షా ప్రకటన అనంతరం రాజ్యసభ నేటికి వాయిదా పడింది.

Last Updated : Dec 7, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.