ETV Bharat / bharat

నాగాలాండ్​ ఘటనపై ఉభయ సభల్లో అమిత్​ షా ప్రకటన - లోక్​సభ వార్తలు

parliament winter session live updates
పార్లమెంట్​ సమావేశాలు
author img

By

Published : Dec 6, 2021, 10:59 AM IST

Updated : Dec 6, 2021, 4:21 PM IST

16:14 December 06

రాజ్యసభ వాయిదా

రాజ్యసభ మంగళవారం ఉదయం వరకు వాయిదా పడింది. అంతకుముందు.. నాగాలాండ్​ కాల్పుల ఘటనపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

15:09 December 06

నాగాలాండ్​ ఘటనపై లోక్​సభలో షా వివరణ..

నాగాలాండ్‌ ఘటనపై లోక్​సభలో కేంద్ర హోంమంత్రి వివరణ

కాల్పుల ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తోంది: అమిత్​ షా

ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయి: అమిత్‌షా

ఘటనపై నాగాలాండ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడా: అమిత్‌షా

నాగాలాండ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది: అమిత్‌షా

నాగాలాండ్‌ ఘటనపై సిట్‌ దర్యాప్తు జరుగుతోంది: అమిత్‌షా

సిట్‌ బృందం నెల వ్యవధిలో నివేదిక అందిస్తుంది: అమిత్‌షా

14:04 December 06

పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడ్డాయి.

12:51 December 06

మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో నాగాలాండ్ ఘటనను మరోసారి లేవనెత్తారు విపక్షనేతలు. దీంతో సభ మరోసారి మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

11:12 December 06

రాజ్యసభ వాయిదా

పార్లమెంట్​కు నాగాలాండ్​ కాల్పుల సెగ తగిలింది. ఈ క్రమంలో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది.

నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మధ్యాహ్నం ప్రకటన చేస్తారని భాజపా ఎంపీలు వెల్లడించారు. ఘటన చాలా సున్నితమైనదని, దాని తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే షా ఇప్పుడే ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్​సభ, రాజ్యసభలో విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడింది. నిరసనల మధ్య లోక్​సభ కొనసాగుతోంది.

10:50 December 06

అమిత్​ షా ప్రకటన

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ఆరో రోజుకు చేరాయి. రెండు రోజుల విరామం తర్వాత నేడు సభలు తిరిగి సమావేశమవుతున్నాయి. సైన్యం కాల్పుల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నాగాలాండ్​ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. పార్లమెంట్​ వేదికగా ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.

మరోవైపు పార్లమెంట్​లో పలువురు కీలక ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. నాగాలాండ్​ ఘటనతో పాటు సభలో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చిచినట్టు తెలుస్తోంది.

Last Updated : Dec 6, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.