ETV Bharat / bharat

Parliament Special Session : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 10:32 AM IST

Updated : Sep 21, 2023, 12:01 PM IST

Parliament Special Session 2023
Parliament Special Session 2023

12:00 September 21

చైనా అంశంపై చర్చించేందుకు తనకు దమ్ముందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దమ్ముంటే చైనాపై లోక్​సభలో చర్చకు రావాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదురి చేసిన సవాల్​కు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు.

11:20 September 21

రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్ మేఘ్​వాల్ ప్రవేశపెట్టారు.

11:15 September 21

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
  • చంద్రయాన్‌-3 విజయంపై లోక్‌సభలో చర్చ
  • చంద్రయాన్‌-3 విజయానికి కృషి చేసిన ఇంజనీర్లను కొనియాడిన స్పీకర్‌ ఓం బిర్లా
  • చంద్రయాన్‌-3 విజయం సాధించిన కొన్ని రోజులకే ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించాం: ఓం బిర్లా
  • సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించాం: ఓం బిర్లా
  • సూర్యుడిపై అధ్యయనానికి ప్రయోగించిన తొలి మిషన్‌ ఆదిత్య-ఎల్‌1: స్పీకర్‌ బిర్లా
  • చంద్రయాన్‌-3లో అధికసంఖ్యలో మహిళలు భాగస్వామ్యం అయ్యారు: స్పీకర్‌ ఓం బిర్లా
  • ఇవాళ అంతర్జాతీయ శాంతి దివాస్‌ను జరుపుకుంటున్నాం: ఓం బిర్లా
  • అంతర్జాతీయ శాంతిని భారత్‌ కాంక్షిస్తోంది: ఓం బిర్లా

11:06 September 21

గురువారం పార్లమెంట్ ఉభయసభల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లోక్​సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ జరుగుతోంది. రాజ్యసభలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల నివేదికలపై చర్చిస్తున్నారు. కాసేపట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.

10:40 September 21

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని ఆదేశిస్తూ తమ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది బిజు జనతా దళ్.

10:26 September 21

రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. లోక్​సభలో చంద్రయాన్-3పై చర్చ

Parliament Special Session 2023 : లోక్​సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. సప్లిమెంటరీ బిజినెస్ ద్వారా దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనునట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. దీనిపై చర్చ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అదేసమయంలో, లోక్​సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ ఉంటుందని తెలిపారు. 2023 అడ్వొకేట్స్ సవరణ బిల్లును సైతం ఈరోజే తీసుకురానున్నట్లు వివరించారు.

Last Updated : Sep 21, 2023, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.