ETV Bharat / bharat

'6 వాట్సాప్​ గ్రూపుల్లో 'లోక్​సభ' ఘటన నిందితులు- ఎప్పుడూ వాటి కోసమే చర్చ!' - security breach in parliament

Parliament Security Breach Accused : లోక్​సభ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టైన నిందితులందరూ చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌ వంటి స్వాతంత్య్ర యోధుల పేర్లతో ఉన్న ఆరు వాట్సాప్‌ గ్రూపుల్లో సభ్యులని దిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు, నిందితుడు లలిత్ ఝా గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు దిల్లీ పోలీసులు కోల్​కతాలో దర్యాప్తు చేపట్టారు.

Parliament Security Breach Accused
Parliament Security Breach Accused
author img

By PTI

Published : Dec 20, 2023, 9:47 AM IST

Updated : Dec 20, 2023, 10:30 AM IST

Parliament Security Breach Accused : లోక్‌సభలో అలజడి సృష్టించిన కేసులో అరెస్టైన నిందితులు అందరూ చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌ వంటి స్వాతంత్య్ర యోధుల పేర్లతో ఏర్పడిన ఆరు వాట్సప్‌ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిత్యం వీరు స్వాతంత్య్ర సమర యోధుల ఆలోచనలు, ఆదర్శాల గురించి చర్చించుకుంటారని తెలిపారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పులను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

బ్రిటిష్‌ పాలకుల చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్​లో పొగ బాంబు వేసిన భగత్‌ సింగ్‌ చర్యను పునరావృతం చేసేందుకు ఆరుగురు నిందితులు నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. దానిని అమలు చేసేందుకు యత్నించారని పేర్కొన్నారు. పార్లమెంట్​లో భద్రతను చేధించే విషయమై నిందితులు సిగ్నల్స్​ యాప్​ ద్వారా సంభాషించుకున్నారని పోలీసులు తెలిపారు. గత ఏడాది మైసూరులో నిందితులందరూ భేటీ అయ్యారని, ఇందుకోసం నిందితులకు ప్రయాణా ఖర్చులను మైసూరుకు చెందిన మనోరంజన్ భరించారని వివరించారు.

దర్యాప్తు మరింత ముమ్మరం
పార్లమెంట్​ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు లలిత్​ ఝా గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్​కతా వెళ్లింది. ప్రధాన నిందితుడు లలిత్ ఝా బస చేసిన కోల్​కతాలోని బాగుహతి ప్లాట్​ వద్దకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

'పార్లమెంట్​లో అలజడి సృష్టించిన ఘటనకు మూడు రోజుల ముందు లలిత్​ ఝా కుటుంబం కోల్​కతాలోని బాగుహతి ప్లాట్​లో ఉన్నారు. దిల్లీ పోలీసుల బృందం ఆ ప్లాట్ యజమానితో పాటు అక్కడి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించింది' అని ఓ అధికారి తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నగరంలోని డల్హౌసీ ప్రాంతంలోని బీఎస్​ఎన్​ఎల్ కార్యాలయానికి వెళ్లిందని ఆయన తెలిపారు.

ఇదీ జరిగింది
కొద్ది రోజుల క్రితం లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం జరిగింది. ఇద్దరు ఆగంతుకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్​సభలోకి దూకడం తీవ్ర కలకలం రేపింది. సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్​ ఈ పరిణామంతో అప్రమత్తమై వెంటనే సభను వాయిదావేశారు. ఆగంతకుల చర్యతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా సభ నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, పార్లమెంట్ బయట ఇద్దరు వ్యక్తులు స్మోక్ డబ్బాలతో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీలు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

'ఒంటికి నిప్పంటించుకోవాలని నిందితుల ప్లాన్​'- పార్లమెంట్​ ఘటనలో విస్తుపోయే నిజాలు

50 బృందాలతో పార్లమెంట్​ ఘటన దర్యాప్తు- సోషల్​ మీడియా డేటా కోసం మెటాకు లేఖ

Last Updated : Dec 20, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.