ETV Bharat / bharat

'పెగసస్​'పై విపక్షాల ఆందోళన- దద్దరిల్లిన పార్లమెంటు

పెగసస్, సాగు చట్టాలు సహా ఇతర అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. చర్చకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల ఉభయ సభలు ఆగస్టు 2కు వాయిదాపడ్డాయి.

Parliament Moon sessions
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
author img

By

Published : Jul 30, 2021, 8:14 PM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొమ్మిదో రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. పెగసస్​ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చ జరపాలని పట్టుబట్టడం వల్ల ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. నిరసనల మధ్యే పలు బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

లోక్​సభలో ఇలా..

సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా.. ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధం కాగా, పెగసస్ హ్యాకింగ్‌, సాగుచట్టాలు, ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చిన స్పీకర్‌.. ప్రశ్నోత్తరాలను కొనసాగించగా కాంగ్రెస్‌ సహా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లో ఆందోళన చేపట్టారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి విజ్ఞప్తి చేసినా విపక్షాలు శాంతించలేదు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే దేశ రాజధాని, దాని చుట్టపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ బిల్లు-2021, జాతీయ బీమా వ్యాపార జాతీయీకరణ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

విపక్షాల ఆందోళనతో స్పీకర్‌ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడం వల్ల సభను ఆగస్టు 2 వరకు వాయిదా వేశారు.

ఎగువ సభలో..

రాజ్యసభలోనూ అదే పరిస్ధితి కొనసాగింది. సభ ప్రారంభం కాగానే సభ్యుల తీరుపై ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యులు ఈలలు వేయడం, మంత్రుల ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య.. సభ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభా కార్యక్రమాలను కొనసాగించగా పెగసస్‌, సాగు చట్టాలపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టగా, విపక్షాల ఆందోళనతో సభను మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రెండోసారి వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల నిరసన మధ్యే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ చట్ట సవరణ బిల్లు, పరిమిత లయబిలిటీ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం కొబ్బరి అభివృద్ధి బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి.. రాజ్యసభను ఆగస్టు 2 వరకు వాయిదా వేశారు.

'ఆ నోటీసు పరిశీలిస్తాం'

ఆక్సిజన్​ కొరతతో ఎవరు మరణించలేదని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి ప్రకటనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు కాంగ్రెస్​ ఎంపీ వేణుగోపాల్​. సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. నోటీసు తనకు అందిందని.. పరిశీలిస్తామన్నారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వివరణ కోరవచ్చు

పెగసస్ ట్యాంపింగ్​పై విపక్షాల ఆందోళనలు కేంద్రం తిరస్కరించింది. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం అనుమతించే వరకు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుండా చేయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ విషయంపై ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్​ను వివరణ కోరవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చ జరపాలని పార్లమెంట్​ వర్షకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.

ఇదీ చూడండి: Pegasus News: పెగసస్ వ్యవహారంపై వచ్చేవారం సుప్రీం విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.