రాజ్యసభ వాయిదా..
విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ 5 గంటల వరకు వాయిదా పడింది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్, ట్రెజరీ బెంచ్ మధ్య వాగ్వాదంతో వివాదం తలెత్తింది. లఖింపుర్ ఖేరి ఘటన సహా ఇతర అంశాలపై విపక్షాల నిరసనల మధ్యే పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా.
88 శాతం మందికి తొలిడోసు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల కృషితో దేశంలో 88 శాతం మందికి తొలిడోసు పూర్తయినట్లు తెలిపారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. 58 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో మెజారిటీ ప్రజలు టీకా తీసుకున్నట్లు తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 17 కోట్ల డోసులు అందుబాటులు ఉన్నాయన్నారు. తయారీ సామర్థ్యం పెంచామన్నారు. ప్రస్తుతం నెలకు 31 కోట్ల డోసులు తయారు చేస్తుండగా.. వచ్చే 2 నెలల్లో 45 కోట్ల డోసులకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు
దేశంలో ప్రస్తుతం 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. తొలి, రెండో దశ ఉద్ధృతి అనుభవంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.