ETV Bharat / bharat

కీలక బిల్లులకు ఆమోదం- ఉభయ సభలు రేపటికి వాయిదా - రాజ్యసభ వాయిదా

parliament
పార్లమెంట్​
author img

By

Published : Aug 4, 2021, 11:23 AM IST

Updated : Aug 4, 2021, 3:38 PM IST

15:38 August 04

రేపటికి వాయిదా

లోక్​సభ రేపటికి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం కానున్నారు. వాయిదాకు ముందు కోకోనట్ బోర్డు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

15:14 August 04

మరో బిల్లు పాస్

ఎయిర్​పోర్ట్ ఎకనామిక్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీనిపై మూజువాణి ఓటింగ్ జరగ్గా... విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. 

ఈ బిల్లును ప్రవేశపెట్టిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ సర్కారు రెట్టింపు ఎయిర్​పోర్టులను నిర్మించిందని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో చిన్న నగరాలకు సైతం విమాన సౌకర్యం అందిందని చెప్పారు. 

బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 

14:43 August 04

వాయిదా

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు సైతం రాజ్యసభ పచ్చజెండా ఊపింది. అనంతరం సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది. 

14:36 August 04

టీఎంసీ ఎంపీల నిరసన

రాజ్యసభలో ఒకరోజు సస్పెన్షన్​కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్​లో నిరసనకు దిగారు. రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. వీరిని నిలువరించేందుకు మార్షల్స్​ను మోహరించారు. 

14:33 August 04

బిల్లు ఆమోదం

లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్య సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగానే బిల్లుకు.. మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదం తెలిపింది. 

14:11 August 04

లోక్​సభ వాయిదా

దిల్లీలో వాయు కాలుష్యం నియంత్రించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో దీనికి పచ్చజెండా ఊపింది. సభ్యుల ఆందోళనల మధ్యే దీనికి ఆమోదం లభించింది. అనంతరం సభ 3.30 గంటలకు వాయిదా పడింది. 

12:20 August 04

ఫోన్ల హ్యాకింగ్‌, రైతు సంబంధిత అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్​సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

12:11 August 04

సభా వ్యవహారాలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. ఈ రోజు జరిగే కార్యకలాపాలకు హాజరు కాకూడదని ఆదేశించారు.

విపక్ష ఎంపీల ఆందోళనలతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే.. టీఎంసీ సహా ఇతర విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. వెల్​లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. 

సభ్యులు వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని ఛైర్మన్ వెంకయ్య తొలుత అభ్యర్థించారు. అయినా వినకపోవడం వల్ల రూల్ 255 ప్రకారం... నిరసన చేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేశారు.

11:58 August 04

పెగసస్​ వ్యవహారంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్​సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

11:20 August 04

పెగసస్​ వ్యవహారంపై ఆందోళన- ఉభయ సభలు వాయిదా

పెగసస్​, వ్యవసాయ చట్టాలపై విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ, లోక్​సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్​సభ ఉదయం 11.30 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడ్డాయి. 

పెగసస్​, వ్యవసాయ చట్టాలతో పాటు ఇతర సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని రెండు సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. బిగ్గరగా నినాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు సభలు వాయిదా పడ్డాయి.  

అంతకు ముందు కాంగ్రెస్​ నేత మల్లిఖార్జు ఖర్గే కార్యాలయంలో విపక్ష నాయకులు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Last Updated : Aug 4, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.