ETV Bharat / bharat

పెగాసస్​పై కేంద్రం కీలక ప్రకటన- రాజ్యసభలో హైడ్రామా - పార్లమెంట్ సమావేశాలు

PARLIAMENT LIVE UPDATES
పార్లమెంట్ లైవ్ అప్డేట్స్
author img

By

Published : Jul 22, 2021, 11:11 AM IST

Updated : Jul 22, 2021, 4:30 PM IST

16:02 July 22

లోక్​సభ శుక్రవారానికి వాయిదా

పెగాసస్ సహా వేర్వేరు అంశాలపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభ శుక్రవారానికి వాయిదా పడింది.

14:56 July 22

'పెగాసస్... భారత ప్రజాస్వామ్యంపై బురదచల్లే కుట్ర'

రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా మరికొందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణల్ని కేంద్రం ఖండించింది. రాజ్యసభలో విపక్షాల ఆందోళనల మధ్యే ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈమేరకు ఓ ప్రకటన చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఉద్దేశపూర్వకంగానే పెగాసస్ వ్యవహారంపై వార్తలు ప్రచురితమయ్యాయని మండిపడ్డారు. గతంలోనూ వాట్సాప్​కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయని అన్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలుచేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి.

ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇస్తుండగా.. టీఎంసీ ఎంపీ అడ్డుపడ్డారు. మంత్రి చేతులోని పేపర్లను లాక్కుని, చించి పైకి విసిరారు. వెల్​లోకి ప్రేవేశించి కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఛైర్మన్​ సభను రేపటికి వాయిదా వేశారు.

14:06 July 22

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా అనంతరం.. మళ్లీ సమావేశమైనప్పటికీ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగలేదు. 

దీంతో లోక్​సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.

మరోవైపు, రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా సభ రేపటికి వాయిదా పడింది.

12:32 July 22

పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం సహా వివిధ అంశాలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఒకరోజు విరామం తర్వాత సమావేశమైన ఉభయ సభలు.. నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి.

లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ దశలో కృష్ణా జలాలపై వైకాపా సహా వివిధ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇతర పార్టీల ఎంపీలు సైతం ఆందోళనలకు దిగడం వల్ల స్పీకర్.. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం సమావేశమైనప్పటికీ.. సభ సజావుగా సాగలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు.

పెద్దల సభలోనూ గందరగోళమే

అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి తలెత్తింది. దైనిక్‌ భాస్కర్‌ పత్రికా సంస్థలపై ఐటీ దాడులు, పెగాసస్‌ అంశంపై విపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. తమ సీట్లలోకి వెళ్లాలని ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

12:20 July 22

విపక్ష సభ్యుల ఆందోళనలు లోక్​సభలో కొనసాగుతున్నాయి. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 

12:03 July 22

రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

11:13 July 22

లోక్​సభ సైతం విపక్షాల ఆందోళనతో వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.

11:08 July 22

పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో చర్చ ప్రారంభానికి ముందే పలువురు విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. 

దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ సమావేశం కానున్నట్లు తెలిపారు.

Last Updated : Jul 22, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.