విపక్షాలు నిరసన కొనసాగించడం వల్ల లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టు- ఉభయ సభలు వాయిదా - పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
16:45 July 27
16:12 July 27
విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. లోక్‌సభ సాయంత్రం 4.30గంటల వరకు వాయిదా పడింది.
15:51 July 27
ఆందోళనల ఆగకపోవడం వల్ల లోక్‌సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది.
15:11 July 27
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 4 గంటల వరకు వాయిదా పడింది. ఆందోళనలు కొనసాగుతుండగానే నేవిగేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది రాజ్యసభ.
14:42 July 27
విపక్షాల ఆందోళనలు కొనసాగగా... లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
14:10 July 27
ఉభయ సభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. పలుమార్లు వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా విపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. పెగాసగ్పై చర్చ జరపాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ మరోమారు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
మరోవైపు లోకసభలో కూడా విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్.
12:41 July 27
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేస్తూ.. కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ నిర్ణయం తీసుకున్నారు.
12:31 July 27
రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. వర్షకాల సమావేశాల్లో సభ సజావుగా సాగకుండా చూసేందుకు కొందరు సభ్యులు నిర్ణయం తీసుకున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు తమ ఆలోచనా దృక్ఫతాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
"సభలోని కొన్ని వర్గాలు ఈ సమావేశాల్లో కార్యకలాపాలు సజావుగా జరగకూడదని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడం ఆందోళనకరం. చట్టాలు తయారు చేయడానికి, చర్చలు జరపడానికే పార్లమెంట్ అనేది ఉంది. ఈ దుస్థితిపై కొన్ని పార్టీల నేతలు నాతో ఆందోళన వ్యక్తం చేశారు. సభను ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడంపై ఫిర్యాదు చేశారు. సభ్యులంతా తమ ఆలోచనను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా."
-వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
12:12 July 27
విపక్ష సభ్యులు పెగాసస్‌పై చర్చకు పట్టుబడుతూ ఆందోళనలు కొనసాగించడం వల్ల.. రాజ్యసభ మరోమారు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.
12:08 July 27
వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభ మరోమారు మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా పడింది.
11:34 July 27
విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ సైతం వాయిదా పడింది. 11.45 గంటలకు మళ్లీ సమావేశం కానున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
11:25 July 27
ఉభయ సభలు
పెగాసస్ నిఘా వ్యవహారంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతోంది. దీనిపై చర్చ జరపాలని రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం వల్ల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.