ETV Bharat / bharat

లైవ్​: విపక్షాల రగడ- ఉభయ సభలు ఈనెల 15కు వాయిదా

author img

By

Published : Mar 10, 2021, 11:04 AM IST

Updated : Mar 10, 2021, 2:47 PM IST

parliament budget session live updates
పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు

14:44 March 10

మార్చి 15 వరకు ఉభయ సభలు వాయిదా

సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్​ ఉభయ సభలు ఈనెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా.. సాగు చట్టాలు, చమురు ధరలపై ఆందోళనకు దిగాయి విపక్షాలు. దీంతో సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా.. వాయిదాల పర్వం కొనసాగింది.  

బిల్లుకు ఆమోదం. 

మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు-2021కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 

12:10 March 10

రాజ్యసభ మరోమారు మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. విపక్షాలు ఆందోళనలు విరమించక పోవడం వల్ల ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

11:43 March 10

చమురు ధరల పెరుగుదలపై చర్చ జరపాలని లోక్​సభలో విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. వీరి ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

11:29 March 10

సాగు చట్టాలపై చర్చ జరపాలని రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది.

10:32 March 10

లైవ్​: విపక్షాల రగడ- రాజ్యసభ 2గంటలకు వాయిదా

పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు మూడో రోజు సమావేశమయ్యాయి. 

పెరుగుతున్న చమురు ధరలపై విపక్షాలు రెండు రోజులుగా ఆందోళనలకు దిగిన కారణంగా సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.

Last Updated : Mar 10, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.