ETV Bharat / bharat

లోక్​సభ ఘటనలో మెయిన్​ రోల్​ మనోరంజన్​దే!- దాడి వెనుక ఉద్దేశం అదే!! - పార్లమెంట్ దాడి ఘటన నిందితుడు డి మనోరంజన్

Parliament Attack Accused Mastermind Manoranjan : పార్లమెంట్​పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా కర్ణాటకకు చెందిన మనోరంజన్​ను పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సందేశం పంపించాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Parliament Attack Accused Mastermind Manoranjan

author img

By PTI

Published : Dec 23, 2023, 7:16 AM IST

Parliament Attack Accused Mastermind Manoranjan : పార్లమెంట్​లో అలజడి ఘటనలో ప్రధాన కుట్రదారు డి.మనోరంజనేనని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక సంచలనాత్మక ఘటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సందేశం పంపించాలనే ఉద్దేశంతోనే లోక్‌సభలో అలజడికి నిందితులు ఈ కుట్ర పన్ని ఉంటారని భావిస్తున్నారు. పన్నాగం అమలుకు నిందితులను ఒప్పించడంలోనూ మనోరంజన్ కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన లలిత్‌ ఝా దర్యాప్తులో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. పార్లమెంట్ ఘటన తర్వాత ఆధారాలను చెరిపివేసే బాధ్యతను మాత్రమే తనకు అప్పగించారని లలిత్‌ విచారణ సమయంలో పేర్కొన్నాడని తెలుస్తోంది.

ఈ నెల 13న పార్లమెంటు లోపల దాడికి ప్రయత్నించి సాగర్‌ శర్మతో పాటు మనోరంజన్‌ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఇక సంవత్సరం క్రితం తాము మైసూరు వెళ్లేందుకు టికెట్లను సమకూర్చింది కూడా మనోరంజనేనని లలిత్‌ ఝా తెలిపాడు. నిందితులు అందరికీ శుక్రవారం మానసిక విశ్లేషణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగ సమస్య, రైతుల ఉద్యమం, మణిపుర్‌ సంక్షోభం వంటివి తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని నిందితులు చెప్పినట్లు తెలిపారు. అయితే, పార్లమెంటుపై దాడి ఘటనకు సంబంధించి సహేతుకమైన కారణాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం లలిత్‌ ఝాను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు లలిత్​ను 14 రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించింది. నిందితులకు ఆశ్రయమిచ్చిన విశాల్‌ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఇవ్వాలన్న ఉత్తర్వుల నిలిపివేత
లోక్​సభలో అలజడి సృష్టించిన నిందితులకు సబంధించిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని అందజేయాలంటూ దిల్లీ పోలీసులకు ట్రయల్‌ కోర్టు జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు నిలిపివేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులను పోలీసులు దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్​ను జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. నిందితురాలు నీలం దేవికి నోటీసు జారీ చేయడం సహా ట్రయల్‌ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణ జనవరి 4వ తేదీకి వాయిదా పడింది. అయితే అత్యంత సున్నితమైన ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ ప్రతి కోసం నిందితులు పోలీస్‌ కమిషనర్‌ను సంప్రదించాల్సిందని, కానీ నేరుగా ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారని పోలీసులు వాదించారు. ప్రధాన నిందితులు మనోరంజన్‌, సాగర్‌శర్మ, అమోల్‌ ధన్‌రాజ్‌ శిందే, నీలం దేవిలకు విధించిన కస్టడీని ట్రయల్‌ కోర్టు జనవరి 5వ తేదీ వరకు గురువారం పొడిగించింది.

'6 వాట్సాప్​ గ్రూపుల్లో 'లోక్​సభ' ఘటన నిందితులు- ఎప్పుడూ వాటి కోసమే చర్చ!'

'లోక్​సభ ఘటన'- పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు- మనోరంజన్​ ఫ్రెండే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.