ETV Bharat / bharat

వందల పాములతో ఊరేగింపు- మెడకు చుట్టుకుని ఆడిస్తూ...

నాగ పంచమి అంటే.. పుట్టలో పాలు పోయడం, పాములకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వంటివి సాధారణంగా జరిగే విషయాలు. కానీ వందల సంఖ్యలో సర్పాలను బయటకు తీసి.. వాటికి ఊరేగింపు నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా? అంతేకాదు విషపూరిత సర్పాలతో విన్యాసాలు చేస్తున్నారు బిహార్ వాసులు.

parade with snakes on Nag Panchami in Samastipur
నాగ పంచమి వందల పాములు
author img

By

Published : Jul 29, 2021, 11:46 AM IST

Updated : Jul 29, 2021, 12:54 PM IST

వందల పాములతో ఊరేగింపు- మెడకు చుట్టుకుని ఆడిస్తూ

బిహార్​లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్​చాక్ బ్లాక్​లోని అగార్​పుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి వందల పాములను బయటకు తీస్తారు. మంత్రాలు ఉచ్ఛరిస్తూ పాములను తీసి.. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు. ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే.

parade with snakes on Nag Panchami in Samastipur
పాములతో ఊరేగింపు

.

1981లో ఇక్కడ భగవతి స్థాన్ అనే మందిరం ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి గ్రామానికి ఎలాంటి సమస్య రాలేదని స్థానికులు చెబుతున్నారు. పాములను పట్టుకునే సంప్రదాయాన్ని గ్రామ భగత్(పూజారి) ప్రారంభించారని తెలిపారు. ఈ వేడుకలు కాస్త విశేష ప్రాచుర్యంలోకి వచ్చి.. తమ ప్రాంతానికి పేరు తెచ్చిపెట్టాయని వివరించారు.

ఊరేగింపు

మరోవైపు, సమస్తీపుర్ జిల్లాలోని విభూతిపుర్​లో పదుల సంఖ్యలో పాములను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో యువకులు.. సర్పాలను తమ చేతుల్లో పట్టుకొని రోడ్లపై తిరిగారు. అదే సమయంలో.. సింఘియా ఘాట్​లో స్నేక్ ఫెయిర్ నిర్వహించారు. నాలుగు వందల ఏళ్లుగా ఇక్కడ స్నేక్ ఫెయిర్ నిర్వహించుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు.

సర్పాలను ఊరేగించడం, వాటితో విన్యాసాలు చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని భావిస్తారు భక్తులు. అయితే, ఒకే ప్రాంతం నుంచి వందల సంఖ్యలో పాములు ఎలా బయటకు వస్తున్నాయనే విషయం ఇప్పటికీ అంతుపట్టని విషయం. ఈ పాములు భక్తులను కాటేయకపోవడం కూడా ఆశ్చర్యకరమే. ఈ వేడుకలను చూసేందుకు మాత్రం వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 29, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.