మౌలిక వసతులు, అభివృద్ధి ఫైనాన్సింగ్ జాతీయ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ)- డీఎఫ్‌ఐ (డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్) ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది పార్లమెంట్. దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ బ్యాంకు ద్వారా నిధులు అందనున్నాయి.
మూజువాణి ఓటు ద్వారా ఎన్ఏబీఎఫ్ఐడీ బిల్లు- 2021ని రాజ్యసభ గురువారం ఆమోదించింది. దీనికి మార్చి 23నే లోక్సభలో ఆమోదం లభించింది.
ఎన్ఏబీఎఫ్ఐడీ ద్వారా దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు నాన్ రీకోర్స్ (లాభాల నుంచి మాత్రమే రుణగ్రహీత అప్పు చెల్లించాలి) నిధులు లభిస్తాయి. బాండ్లు, డెరివేటివ్స్ మార్కెట్ల వృద్ధికి ఇది దోహదపడుతుంది. పైగా ఈ బ్యాంకు కేవలం పార్లమెంట్‌కు మాత్రమే జవాబుదారీతనం వహిస్తుంది. మరిన్ని నిధుల లభ్యతకు ఎన్ఏబీఎఫ్ఐడీకి ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు కల్పించారు.
ఇదీ చూడండి: మౌలికాభివృద్ధికి మళ్లీ బ్యాంకు