ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
బానో బేగం అనే పాకిస్థానీ మహిళ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటాకు చెందిన అక్తర్ అలీని 1980లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వీసాపై భారత్‌లోనే నివసిస్తోంది. వీసా గడువుతీరిన ప్రతిసారి పునరుద్ధరించుకుంటూ ఇక్కడే ఉంటోంది. అయితే గదవ్ గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. గ్రామ సర్పంచ్ చనిపోవడం వల్ల ఆ పదవి దక్కించుకోవాలని ప్రయత్నించింది. దాంతో గ్రామస్థులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. శనివారం బానోను ఆమె ఇంటికి సమీపంలో అరెస్టు చేశామని జలేసర్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆ 2.5 లక్షల మందిపై కేసులు ఎత్తేస్తున్నాం'