ETV Bharat / bharat

కశ్మీర్​లో పాకిస్థానీ మహిళల నిరసన.. ఎందుకంటే? - శ్రీనగర్​లో పాకిస్థానీ మహిళల ఆందోళన

కశ్మీరీ మాజీ ఉగ్రవాదుల భార్యలు శ్రీనగర్​లో ఆందోళన చేపట్టారు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను కలుసుకునేందుకు పాక్​కు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్​ చేశారు.

Pakistani wives of ex-Kashmiri militants protest in Srinagar
కశ్మీర్​లో పాకిస్థానీ మహిళల నిరసన.. ఎందుకంటే?
author img

By

Published : Feb 24, 2021, 12:03 PM IST

పాకిస్థాన్​కు చెందిన కశ్మీర్​ మాజీ ఉగ్రవాదుల భార్యలు శ్రీనగర్​లో మంగళవారం నిరసనబాట పట్టారు. పాక్​లోని వారి తల్లిదండ్రులు, బంధువులను కలవడానికి వెళ్లేందుకు ప్రయాణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు శ్రీనగర్​ నుంచి ఘంటాఘర్​కు కవాతు చేపట్టారు.

నిరసన చేపట్టిన మాజీ ఉగ్రవాదుల భార్యలు

ఎందుకీ నిరసన?

పాక్​కు చెందిన కొందరు మహిళలు గతంలో కశ్మీర్​ ఉగ్రవాదులను వివాహమాడారు. ఈ నేపథ్యంలో ఆ మహిళలు తమ భర్తలతోపాటు కశ్మీర్​లోనే స్థిరపడ్డారు. అయితే.. ఆయుధాల కోసం సరిహద్దు దాటి పాక్​కు వెళ్తుండగా పట్టుబడ్డారు. దీంతో వారిని మాజీ ఉగ్రవాదుల కింద చేర్చిన అధికారులు.. పునావారస విధానం కల్పించారు. ఈ నిబంధన ప్రకారం.. వారు తల్లిదండ్రులను, బంధువులను సరిహద్దు అవతలివైపు నుంచి మాత్రమే కలుసుకునేందుకు వీలుంటుంది. ఈ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన బాటపట్టారు ఈ పాకిస్థానీ ఉగ్రవాదుల భార్యలు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లడానికి వీలు కల్పించాలని కోరారు.

"మాకు కల్పించిన పునరావాస విధానం వల్ల ఎలాంటి గుర్తింపు లేదు, రేషన్​ కార్డులూ లేవు. ఫలితంగా పిల్లలను పాఠశాలల్లో చేర్పించలేకపోతున్నాం. మా భర్తలకు కూడా ఎలాంటి జీవనోపాధి లేదు."

- మహిళా నిరసనకారులు

ఇదీ చదవండి: కాలిన గాయాలతో.. రోడ్డు పక్కన నగ్నంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.