ETV Bharat / bharat

'ఎల్​ఓసీ వెంబడి అలజడులకు పాక్​ కుట్ర!' - 'దృష్టి మరల్చేందుకు దాడులకు దిగొచ్చు'

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్​ దాడులకు దిగే అవకాశం ఉందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణతో పాటు అక్రమ చొరబాట్లకు తావుందని ఆయన తేల్చి చెప్పారు. తమ దేశ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా చేసే అవకాశముందని పేర్కొన్నారు.

Pakistan may raise tensions along LoC to divert attention from internal issues: Top Army commander
'దృష్టి మరల్చేందుకు దాడులకు దిగొచ్చు'
author img

By

Published : Dec 27, 2020, 5:58 PM IST

Updated : Dec 27, 2020, 7:09 PM IST

నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి పాకిస్థాన్​ అలజడులు సృష్టించే అవకాశం ఉందని.. ఎక్స్​వీ కార్ప్స్​కు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్​ బీఎస్​ రాజు హెచ్చరించారు. తమ దేశ అంతర్గత సమస్యల నుంచి సొంత ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా చేసే అవకాశముందని వెల్లడించారు. 'చొరబాట్లకు ప్రస్తుత శీతకాలం అనువైన సమయం. భారత్​లోకి ప్రవేశించడానికి 200 నుంచి 250 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో వేచి ఉన్నారు. అందుకు సంబంధించి మాకు సమాచారం అందింద'ని పేర్కొన్నారు.

చొరబాట్లకు అనుకూలంగా ఉన్న కశ్మీర్​, పీర్​ పంజాల్​ శ్రేణి దక్షిణ ప్రాంతాలలో సైనికుల పహారా ఎక్కువగా ఉన్నట్లు ఆర్మీ కమాండర్​ వెల్లడించారు. పాక్​.. కాల్పుల విరమణకు పాల్పడే అవకాశమూ లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్​లో కొంతకాలంగా రాజకీయ అశాంతి నెలకొంది. ఇమ్రాన్​ఖాన్​ ప్రభుత్వం వచ్చే నెల 31లోపు అధికారం నుంచి తప్పుకోవాలని 11 పార్టీల విపక్ష కూటమి హెచ్చరించిన నేపథ్యంలో లెఫ్టినెంట్​ జనరల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలపై సంతృప్తి:

జమ్ముకశ్మీర్​లో ఇటీవలే జరిగిన 'జిల్లా అభివృద్ధి మండలిల' ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడంపై లెఫ్టినంట్ జనరల్​ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. ప్రజలకు సేవ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇదీ చదవండి: 'ఇమ్రాన్​ను తొలగించేందుకు ఆర్మీ అనుమతి అక్కర్లేదు'

Last Updated : Dec 27, 2020, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.