ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ డ్రోన్ కూల్చివేత.. వారం రోజుల్లో మూడోసారి.. - భారత్​ పాకిస్థాన్​ డ్రోన్​

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​.. భారత్​ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్​సర్​ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్​ డ్రోన్​పై బీఎస్​ఎఫ్​ కూల్చివేసింది. అనంతరం ఆ డ్రోన్​ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Pak drone shot down by BSF in Punjab
Pak drone shot down by BSF in Punjab
author img

By

Published : Dec 26, 2022, 10:10 AM IST

Updated : Dec 26, 2022, 11:05 AM IST

Pakistan Drone Shot Down: భారత సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్ల కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి నేలకూల్చాయి. అమృత్‌సర్ జిల్లా రాజతాల్ గ్రామంలో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సైన్యం ప్రకటించింది. డ్రోన్‌ను కూల్చిన ప్రాంతంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Pak drone shot down by BSF in Punjab
సరిహద్దులో పాక్​ 'డ్రోన్' కూల్చివేత

వారం రోజుల్లో మూడు డ్రోన్లను..
పంజాబ్‌లో గత వారం రోజుల్లో మూడు పాకిస్థాన్ డ్రోన్‌లను సరిహద్దు దళం కూల్చివేసింది. చలికాలం కావడం వల్ల సరిహద్దుల్లో పొగ మంచు అధికంగా ఉంటోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పాకిస్థాన్​ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాలు ఉన్న ప్యాకెట్లను సరిహద్దుల్లోని పంటపొలాల్లో పాక్‌ డ్రోన్లు జార విడుస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.