ETV Bharat / bharat

హద్దు మీరిన పాక్- బుద్ధి చెప్పిన భారత్ - కశ్మీర్​లో కాల్పులు

పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్​లోని సరిహద్దు వెంబడి గ్రామాలు, ఫార్వర్డ్ పోస్టులే లక్ష్యంగా దాడి చేసింది. ఈ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు.

Pak continues ceasefire violation along IB in JK's Kathua
హద్దు దాటిన పాకిస్థాన్- బుద్ధి చెప్పిన భారత్
author img

By

Published : Nov 22, 2020, 3:06 PM IST

పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, ఫార్వార్డ్ పోస్టుల లక్ష్యంగా కాల్పులకు తెగబడింది.

అయితే పాక్ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

"ఆదివారం ఉదయం 11.15 గంటలకు పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్లింగులతో దాడి చేసింది. రాజౌరీ జిల్లా నౌషీరా సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు ప్రారంభించింది. దీనికి భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది."

-భారత సైన్యం ప్రతినిధి

శనివారం రాత్రి కూడా సరిహద్దులో కాల్పులు జరిగినట్లు సైన్యం తెలిపింది. సత్పాల్, మన్యారీ, కరోల్ కృష్ణ, గుర్నమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం దాడి చేసినట్లు పేర్కొంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ కాల్పులు.. తెల్లవారుజామున 3.45 గంటల వరకు కొనసాగినట్లు వెల్లడించింది. భారత్​వైపు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.

జమ్ము కశ్మీర్​లో ఈ ఏడాది 4 వేల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. గత పదేళ్లలో ఇదే అత్యధికం. 2019లో ఈ సమయానికి 3,289 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయి.

ఇదీ చదవండి- భద్రతా బలగాల అదుపులో ఉగ్రవాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.