ETV Bharat / bharat

'పాక్​ నిర్ణయంతో సిక్కు మత రక్షణకు భంగం'

పాకిస్థాన్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది భారత్​. కర్తార్​పుర్​ నడవా నిర్వహణను ఇష్టానుసారంగా పాకిస్థాన్​ మార్చిందని.. అది సిక్కు మత రక్షణకు భంగం కలిగించే విషయమని మండిపడింది. ఈ వ్యవహారంలో ఐరాస సాధారణ సభపైనా అసహనం వ్యక్తం చేసింది భారత్​. కొన్ని మతాల రక్షణనే యూఎన్​జీసీ పరిగణిస్తోందని.. ఈ విధానం సరైనది కాదని తేల్చిచెప్పింది. అన్ని మతాలవారు ప్రశాంతంగా ఉండాలని పేర్కొంది.

Pak arbitrarily transferred management of Kartarpur Sahib Gurudwara, violated UNGA resolution: India
పాకిస్థాన్​ నిర్ణయంతో సిక్కు మత రక్షణను భంగం'
author img

By

Published : Dec 3, 2020, 12:56 PM IST

కర్తార్​పుర్​ నడవా నిర్వహణ వ్యవస్థను ఇష్టానుసారంగా మార్చివేసిన పాకిస్థాన్​పై తీవ్రస్థాయిలో మండిపడింది భారత్​. ఈ విధంగా ప్రవర్తించి.. ఐరాస సాధారణ సభ(యూఎన్​జీసీ) తీర్మానాన్ని పాకిస్థాన్​ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

'కల్చర్​ ఆఫ్​ పీస్​'పై యూఎన్​జీసీలో ప్రసంగించారు ఐరాసలో భారత శాశ్వత మిషన్​ మొదటి కార్యదర్శి ఆశిష్​ శర్మ. సిక్కు మతం, దాని రక్షణకు పాక్​ చర్యలు భంగం కలిగిస్తున్నాయని తేల్చిచెప్పారు.

కర్తార్​పుర్​ సాహెబ్​ నడవా నిర్వహణను..​ సిక్కు గురుద్వారా పర్బంధక్​ కమిటీ నుంచి ఈటీపీబీ(ఇవాక్యు ట్రస్ట్​ ప్రాపర్టీ బోర్డు) యంత్రాంగానికి గత నెలలో బదిలీ చేసింది ఇమ్రాన్​ఖాన్​ ప్రభుత్వం. అది సిక్కుయేతర బోర్డు కావడం గమనార్హం.

నవంబర్​లోనే పాక్​ నిర్ణయాన్ని ఖండించింది భారత్​. పాకిస్థాన్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కర్తార్​పుర్​ నడవా విలువలు, సిక్కుల విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని మండిపడింది.

ఇదీ చూడండి:- 'ఇలా అయితే మేం పాకిస్థాన్​‌ నుంచి వెళ్లిపోతాం!'

యూఎన్​జీసీ విఫలం...

బౌద్ధ, హిందు, సిక్కు మతాలపై జరుగుతున్న దాడులను గుర్తించడంలో యూఎన్​జీసీ విఫలమైందని అసహనం వ్యక్తం చేసింది భారత్​. కొన్ని మతాలనే ఎంచుకుని వాటిపైనే స్పందిస్తోందని... ఈ వ్యవహారంశైలి సరైనది కాదని తేల్చిచెప్పారు ఆశిష్​. కేవలం 'అబ్రహామిక్​' మతాలకే శాంతి ఉండాలనుకోవడం మంచి విషయం కాదని.. అన్ని మతాలవారూ ప్రశాంతంగా జీవించాలని పేర్కొన్నారు.

యాంటీ సెమిటిసమ్​, ఇస్లామోఫోబియా, యాంటీ క్రిస్టియన్​ కార్యకలాపాలను ఐరాస ఖండించడాన్ని భారత్​ సమర్థిస్తోందని.. కానీ అది కేవలం ఈ మతాలకే పరిమితం కాకూడదని తెలిపారు ఆశిష్​.

మరోవైపు పాకిస్థాన్​పైనా విరుచుకుపడ్డారు ఆశిష్​ శర్మ. భారత్​లోని మతాలపై ద్వేషాన్ని మానుకుని, సీమాంతర ఉగ్రవాదానికి కళ్లెం వేయాలని హితవు పలికారు. అప్పుడే శాంతిని పాటించాలని ఐరాస కోరుకుంటున్న సంస్కృతి.. దక్షిణాసియా సహా ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు వీలు అవుతుందన్నారు. లేకపోతే పాకిస్థాన్​ దుశ్చర్యలను అందరు మౌనంగా వీక్షించక తప్పదని తెలిపారు.

ఇదీ చూడండి:- 'ఎన్నికలు కాదు.. పాకిస్థాన్​తో చర్చలు జరపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.