ETV Bharat / bharat

'ప్రధాని మోదీతో భేటీకి 'గుప్కార్'​ సిద్ధం'

author img

By

Published : Jun 22, 2021, 12:52 PM IST

Updated : Jun 22, 2021, 2:31 PM IST

ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 24న జరగబోయే సమావేశానికి తాము వెళుతున్నట్లు  జమ్ముకశ్మీర్​లోని కొన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటైన గుప్కార్ కూటమి ప్రకటించింది. ప్రధానితో భేటీపై చర్చించేందుకు కూటమి నేతలు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు.

PAGD
గుప్కార్

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి సిద్ధమని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలతో ఏర్పాటైన గుప్కార్ కూటమి ప్రకటించింది. ఈ మేరకు కూటమి ఛైర్​పర్సన్​ ఫరూక్​ అబ్దుల్లా తెలిపారు. ప్రధానితో భేటీపై కూటమి నేతలు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో ప్రధానితో మాట్లాడటాల్సిన అంశాలపై చర్చించారు.

ఆ తర్వాత మాట్లాడిన ఫరూక్​ అబ్దుల్లా.. మోదీ అమిత్​ షాలను కలిసి తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తామని ప్రకటించారు. అంతేకాదు ఆర్టికల్​ 370 పునరుద్ధరణపై తగ్గేదే లేదని స్పష్టం చేశారు. నెల 24న జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ కానున్నారు.

గుప్కార్​ ఏంటీ?

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కీలక నేతల నిర్బంధం తర్వాత అక్కడి రాజకీయాలు స్తబ్దుగా సాగిపోయాయి. క్రమంగా కశ్మీర్​ ప్రయోజనాల కోసం అంటూ.. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఒకే గొడుగు కిందకు చేరారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏడీజీ) పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి ఈ కూటమి ప్రధాన డిమాండ్లు.

'ప్రధాని మోదీ చొరవ ప్రశంసనీయం'

జమ్ముకశ్మీర్​కు సంబంధించిన పార్టీలతో సమావేశం ఏర్పాటుకు ప్రధాని మోదీ తీసుకున్న రాజకీయ చొరవను 'ది జమ్ము అండ్​ కశ్మీర్​ అప్నీపార్టీ'(జేకేఏపీ) ప్రశంసించింది. దీని వల్ల జమ్ముకశ్మీర్​ ప్రజలకు నిజమైన సాధికారత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్​ ప్రజలకోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని జేకేఏపీ అధినేత అల్తాఫ్​ బుకారీ.. కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

అయితే, చర్చలపై కేంద్రం ప్రకటన చేసిన తర్వాత ఇక్కడి పార్టీ నేతల్లో మార్పు వచ్చింది. 'కశ్మీర్​లో ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తే చాలు' అనుకునే పరిస్థితిలో నేతలు ఉన్నారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రత్యేక హోదాపై 'గుప్కార్' వెనక్కి తగ్గినట్లేనా?

Last Updated : Jun 22, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.