కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి కేరళ కాంగ్రెస్ పార్టీ(థామస్ వర్గం) నిష్క్రమించింది. ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పీసీ థామస్.. కేరళ కాంగ్రెస్ పీజే జోసెప్ వర్గంలోకి పార్టీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి తనను నిర్లక్ష్యం చేసిందని థామస్ ఆరోపించారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ల కేటాయింపు విషయంలో అన్యాయం చేసినట్లు పేర్కొన్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కేటాయించిన ఎన్‌డీఏ ప్రస్తుతం ఒక్క సీటును కూడా కేటాయించలేదని థామస్ మండిపడ్డారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం కొట్టాయం జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో కేరళ కాంగ్రెస్.. యూడీఎఫ్ కూటమిలోని కేరళ కాంగ్రెస్ పీజే జోసెప్ వర్గంలోకి విలీనం చేశారు.
విలీన కార్యక్రమానికి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఊమెన్ చాందీ, జోసెఫ్ హాజరయ్యారు.
ఇదీ చదవండి : తమిళనాట 'ఉచిత' వరాల జల్లు- నిపుణుల ఆందోళన