ETV Bharat / bharat

ఎన్సీపీ గూటికి కాంగ్రెస్ మాజీ నేత చాకో - పీసీ చాకో వార్తలు

గత వారం.. కాంగ్రెస్​ నుంచి వైదొలిగిన పీసీ చాకో.. శరద్​ పవార్​ సమక్షంలో ఎన్సీపీలోకి చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ విజయానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

P C Chacko to formally join NCP, work for victory of LDF candidates in Kerala
ఎన్సీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత పీసీ చాకో
author img

By

Published : Mar 16, 2021, 8:14 PM IST

కాంగ్రెస్​ మాజీ నాయకుడు పీసీ చాకో.. నేషనల్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. గతవారం హస్తం పార్టీని వీడిన ఆయన.. ఎన్సీసీ చీఫ్​ శరద్​ పవార్ సమక్షంలో.. దిల్లీలో మంగళవారం అధికారికంగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

P C Chacko to formally join NCP, work for victory of LDF candidates in Kerala
చాకోను ఎన్సీపీలోకి ఆహ్వానిస్తున్న శరద్​పవార్​
P C Chacko to formally join NCP, work for victory of LDF candidates in Kerala
ఎన్సీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత పీసీ చాకో

"నేను ఈ రోజు అధికారికంగా ఎన్సీపీలో చేరాను. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడి భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలవాలి. గతంలో నేను సభ్యుడిగా ఉన్న పార్టీలో ఈ చొరవ నాకు కనిపించలేదు."

- పీసీ చాకో, ఎన్సీపీ నేత

కేరళలో ఏప్రిల్​ 6న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. సీపీఐ నేతృత్వంలోని వామపక్షాల భాగస్వామి అయిన ఎన్సీపీ విజయానికి కృషి చేస్తానని.. ఈ సందర్భంగా చాకో అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్​లో ఉన్న ఆయన.. విభేదాల కారణంగా వారం క్రితం ఆ పార్టీ నుంచి వైదొలిగారు.

ఇదీ చదవండి: 'రికార్డు స్థాయి'లో ఎన్నికల్లో ఓడి కేరళ సీఎం​కు పోటీగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.