కర్ణాటకలో సంప్రదాయంగా వస్తున్న ఆచారాల్లో ఒకటి ఎడ్లపోటీల నిర్వహణ. వీటిలో గెలుపొందే ఆవులకు అభిమాన సంఘాలు, వేలాది మంది అభిమానులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో అర్జున మొదటి స్థానంలో ఉంటుంది. హవేరీ జిల్లాలోని హెడిగొండ గ్రామానికి చెందిన ఫకీరేష్.. అర్జున చిత్రాన్ని గీసి, దానిపై తనకున్న అభిమానం చాటుకున్నాడు.
ప్రత్యేక శిక్షణ..
18 నెలల వయసున్నప్పుడు తమిళనాడులో లక్షన్నర రూపాయలకు కొనుక్కొచ్చిన అర్జునకు (ఎద్దు) ప్రత్యేక శిక్షణనిస్తూ.. పోటీల్లో పాల్గొనేలా సన్నద్ధం చేశారు. ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ చిత్రం మా తమ్ముడు ఫకీరేష్ గీశాడు. ఈ ఎద్దు యజమాని అవినాశ్. మూడు పోటీల్లో విజేతగా నిలిచిన ఎద్దు ఇది. రెండుసార్లు బంగారపు ఉంగరం, ఒకసారి బైక్‌ను గెలుచుకుంది. నడక, పరుగు, స్విమ్మింగ్ పోటీలకు ఈ ఎద్దును తీసుకెళ్తాం. అన్ని రకాలుగా సన్నద్ధం చేస్తాం. ఎవ్వరినీ తన్నడం లాంటి పనులు చేయదు. దీనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
-చంద్రశేఖర్, అర్జున అభిమాని
గెలుపు గ్యారంటీ..
శివమొగ్గ, దావణగెరె, ధార్వాడ్లలో పాల్గొన్న అన్ని పోటీల్లోనూ విజేతగా నిలిచింది అర్జున. చాలా ప్రశాంతంగా కనిపించే ఈ ఎద్దుపై అభిమానంతో చాలా మంది అర్జున పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఓ ఎద్దుకు ఇంతలా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.
''ఏడాది క్రితం 50వేల రూపాయలకు దీన్ని కొన్నాం. ఇప్పటివరకూ పాల్గొన్న 3 పోటీల్లోనూ నెగ్గింది. అందుకే అందరూ దీన్ని 'బంపర్ కా బాప్', 'లుకింగ్ స్టార్' అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టదు.''
-ఫకీరేష్, కళాకారుడు
ఇదీ చదవండి: కూటి కోసం 62ఏళ్ల బామ్మ 'సైకిల్' పాట్లు
ఇదీ చదవండి: చితికిన బతుకు... మొక్కవోని ధైర్యంతో కులవృత్తే ఎంచుకుంది!