ETV Bharat / bharat

పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో' - థాత్రి మాతా కీ జై

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం శనివారమూ కొనసాగింది. 'దిల్లీ చలో' ర్యాలీకి రైతులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజధాని నడిబొడ్డులో బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు రైతులు. మూడు చట్టాలు రద్దయ్యే వరకు ఇంటికెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందని, రైతులు రోడ్లు విడిచి మైదానానికి చేరుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పిలుపునిచ్చారు.

Farmers protest overall
మరో రోజుకు చేరిన రైతన్నల ర్యాలీ
author img

By

Published : Nov 29, 2020, 5:39 AM IST

కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న 'దిల్లీ చలో' అందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. శనివారం నాటికి భారీ సంఖ్యలో రైతులు దిల్లీలోని బురారీ మైదానానికి చేరుకున్నారు. దిల్లీ సమీప ప్రాంతాల్లోనూ రైతులు భారీగా తరలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని నడిబొడ్డులో బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. అంతవరకు శివారుల్లో ధర్నా చేస్తామని చెబుతూ వంటావార్పూ ఆందోళన చేపట్టారు. ఉత్తర దిల్లీలోని బురాడీలో ఉన్న సంత్‌ నిరంకారీ మైదానంలో సభ జరుపుకోవాలన్న అధికారులను సూచనను తిరస్కరించారు. పంజాబ్‌, హరియాణాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు సింఘు, టిక్రి సరిహద్దుల్లోనే మూడో రోజూ కూడా బైఠాయించారు. హరియాణాకు చెందిన రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. వారంతా శంభు సరిహద్దుకు చేరుకోనున్నారు. సింఘులో ఆదివారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని, అందులో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని జలంధర్‌కు చెందిన రైతు నాయకుడు బల్జీత్‌ సింగ్‌ మహల్‌ తెలిపారు. సంత్‌ నిరంకారీ మైదానానికి చేరుకున్న ఇంకొందరు రైతులు అక్కడ కూడా ఆందోళన చేస్తున్నారు.

స్పందించిన అమిత్​ షా

రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. డిసెంబర్‌ 3లోపు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన షా.. వీలైనంత త్వరగా ఈ చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

అమిత్​ షా వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. షా నిర్ణయాన్ని ఆహ్వానించాలని, వీలైనంత త్వరగా రైతులు బురారీకి చేరుకోవాలని అమరీందర్ కోరారు.

ఆరంభం నుంచి సాగిందిలా..

శుక్రవారం రైతులపై భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. వారిని 'దిల్లీ చలో' ర్యాలీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వారు. శనివారం రోజుకి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. కానీ, 'దిల్లీ చలో'లో పాల్గొనేందుకు పంజాబ్​-హరియాణా సరిహద్దులోని సంబాలో భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లెక్కి దిల్లీవైపు సాగుతున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాల అమలును వెనక్కుతీసుకోకపోతే ఆందోళనను ఆపబోమని స్పష్టం చేశారు.

దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీకి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో, ట్రక్కుల్లో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించారు.

బురారీ గ్రౌండ్​కి వెళ్లకుండానే!

బురారీ గ్రౌండ్​కు వెళ్లకుండానే తాము నిరసన కొనసాగిస్తామని పంజాబ్​కు చెందిన రైతు సంఘం భారతీయ కిసాన్​ యూనియన్ స్పష్టం చేసింది. టిక్రీలో సైతం ఇదే వైఖరి కొనసాగుతోంది.

ఉత్తర్​ ప్రదేశ్​లోని ఘాజీపూర్​ సరిహద్దులోనూ చాలా మంది రైతులు చలో దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ రైతులు రోడ్లపై బైఠాయించారు.

'ప్రశ్నతో వస్తున్నాం.. జవాబుతో పోతాం!'

ఆల్​ ఇండియా క్రిషక్ ఖేత్ మజ్దూర్ సంఘటన్ సభ్యులూ ఎట్టకేలకు దిల్లీలోని బురారీకి చేరుకున్నారు. కానీ, తొలుత వారిని యూపీ పోలీసులు అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు. 'ప్రశ్నతో దిల్లీకి వస్తున్నాం.. జవాబుతోనే వెనుదిరుగుతాం అని' ఓ రైతు వ్యాఖ్యానించారు.
చాలా చోట్ల రైతులు 'ధాత్రి మాతా కీ జై', 'నరేంద్ర మోదీ కిసాన్ విరోది', 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని నినాదాలు కూడా చేశారు.

అమరీందర్​, ఖట్టర్ మధ్య కాక

రైతుల ఆందోళనలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ స్పందించారు. రైతుల మధ్య కొన్ని అవాంఛిత అంశాలు కనపడతున్నాయన్నారు. కొందరు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన రాజకీయ ప్రేరేపితమని అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కార్యాలయం నుంచే సూచనలు వెళ్తున్నాయని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అమరీందర్​ సింగ్.. పంజాబ్ రైతులపై ఖట్టర్ క్రూరంగా వ్యవహించారని, దీనికి వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రైతులకు క్షమాపణలు చెప్పేవరకు ఆయతో మాట్లాడబోనని అన్నారు.

'రైతులతో చర్చలు జరపండి'

కాంగ్రెస్​ నేతలు కూడా పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు. మోదీ ఆగ్రహానికి ప్రతిఫలం ఇదని, అది చాలా ప్రమాదకరమని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా వెల్లిడించారు. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదిలా పరిగణిస్తారని మరో సీనియర్ కాంగ్రెస్​ ప్రతినిధి అన్నారు.

'రాంలీలా మైదానం కేటాయించండి'

రైతుల బహిరంగ సభకు దిల్లీలోని రాంలీలా మైదానం కేటాయించాలని 8 పార్టీల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్​పవార్, డీఎంకే లోక్​సభా పక్షనేత టీఆర్​ బాలు, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచారి, డి. రాజా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝూ, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర భట్టాచార్య ఆల్​ ఇండియా పార్వర్డ్​ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్, ఆర్​ ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్యలు సంయుక్త ప్రకటన చేశారు. రైతులు ఆందోళన కొనసాగించినంత కాలం వసతి, ఆహార సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలని కోరారు. అన్నదాతలపై కేంద్రం యుద్ధాన్ని ప్రకటించిందని విమర్శించారు.

ఇదీ చదవండి:'కశ్మీర్​లో కల్లోలం సృష్టించేందుకే చొరబాట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.