ETV Bharat / bharat

దేశంలో 90 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ - భారత్​లో కరోనా టీకా పంపిణీ

భారత్​లో ఇప్పటివరకు 90 లక్షలకు పైగా కరోనా టీకా డోసులను పంపిణీ చేశారని కేంద్రం తెలిపింది. ఏ ఒక్కరిలోనూ టీకా తీసుకున్న తర్వాత ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని చెప్పింది.

Over 90 lakh COVID-19 vaccine doses administered: Govt
దేశంలో 90 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ
author img

By

Published : Feb 17, 2021, 10:54 PM IST

దేశంలో ఇప్పటివరకు 90 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్రం తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఏ ఒక్కరిలోనూ తీవ్ర ప్రతికూలతలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి మన్​దీప్​ భండారీ పేర్కొన్నారు.

టీకా పంపిణీ వివరాలు ఇలా..

  • మొత్తం అందించిన టీకా డోసులు 91,86,757. అందులో ఆరోగ్య సిబ్బంది 65,21,785 మంది కాగా, 26,64,972 మంది కరోనా యోధులు టీకా తీసుకున్నారు.
  • ఆరోగ్య సిబ్బందిలో 61,79,669 మంది మొదటి డోసు టీకా తీసుకోగా.. 3,42,116 మందికి రెండో డోసు టీకా అందించారు.
  • కోవిన్​ యాప్​లో 68.5 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
  • బుధవారం 1,87,527 మంది టీకా తీసుకున్నారు.
  • టీకా తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరినవారు 0.0004 శాతం మాత్రమే.
  • మొత్తం 37 మంది ఆసుపత్రిలో చేరగా.. చికిత్స తర్వాత 23 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. 12 మంది మృతిచెందారు.
  • వ్యాక్సిన్​ తీసుకున్న అనంతరం.. ఇతరత్రా వ్యాధులతో ఇప్పటివరకు 29 మంది మరణించారు. ఇది టీకా తీసుకున్నవారిలో 0.0003 శాతం మాత్రమే.

23 దేశాలకు సాయం..

40 దేశాలు టీకా కోసం భారత్​ సహకారాన్ని కోరగా.. 23 దేశాలకు అందించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. సీఎస్​ఐఆర్​-సెంట్రల్​ ​​డ్రగ్ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్(సీడీఐఆర్​)-లఖ్​నవూ 70వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన వర్చువల్​గా హాజరయ్యారు.

ఇదీ చదవండి:'కరోనాపై అతి విశ్వాసంతో కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.