కరోనా టీకా మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 18-44ఏళ్ల వయసున్న వారిలో 84,599మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం(రాత్రి 8గంటల వరకు) మరో 16,48,192 మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొంది.
అందులో 9,89,700 మంది మొదటి డోసు తీసుకోగా.. 6.58లక్షల మంది రెండో డోసు టీకా అందుకున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15.66కోట్ల డోసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించింది.
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మే1న మొదలైంది. ఇందులో భాగంగా 18-44ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకా అందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి