దేశంలో 7000కు పైగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్) ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అందులోని చాలా రకాల తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
మ్యుటేషన్లలో ఎన్440కే అనే రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అయితే దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని వెల్లడించారు. ప్రతి మ్యుటేషన్ కొత్త వేరియంట్ అయ్యే అవకాశాలు లేవన్నారు.
కొవిడ్-19 వైరస్ జినోమ్(జన్యుసమాచారం, జెనటిక్ కోడ్)ను కనుగొనడంలో భారత్ వెనకబడి ఉందని మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటివరకు కోటి కరోనా కేసుల్లో కేవలం 6,400జినోమ్లను కనుగొన్నారని తెలిపారు.
5000కుపైగా కొత్త కరోనా రకాలపైన సీసీఎంబీ సమగ్ర పరిశీలన చేసి వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా ఎలా మార్పులు చెందిందో పరిశీలించింది. అనంతరం దీనికి సంబంధించిన విషయాలపై పరిశోధనా పత్రాన్ని ప్రచురితం చేసింది.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా 5 వేల కరోనా వేరియంట్లు: సీసీఎంబీ