జమ్ముకశ్మీర్లో రాజకీయ నేతల వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఐదు నెలల్లో 10 మంది నేతలు హత్యకు గురయ్యారు. ఇందులో ఎనిమిది మంది భాజపాకు చెందినవారే కావడం గమనార్హం. అయితే వీరి హత్య వెనుక పాక్ మదత్తు ఉన్న ఉగ్రవాదులున్నారని పోలీసులు నమ్ముతున్నారు.
ఎందుకు.. ఎవరు?
అయితే బాధిత కుటుంబాలకు హత్య చేసిన వారి వివరాలు తెలియజేయడానికి పెద్ద సమయం పట్టడం లేదు. అయితే మీడియా, ఇతర రాజకీయ పార్టీలు మాత్రం హత్య చేసింది గుర్తుతెలియని వ్యక్తులు అనే వెల్లడిస్తున్నాయి.
ఒకప్పుడు...
ఒక వేళ హత్యల వెనుక ప్రభుత్వంలో ఉన్న పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం వస్తే కశ్మీర్లో నిరసనలు మిన్నంటుతాయి. కశ్మీర్ లోయలో బంద్కు పిలుపునిస్తారు వేర్పాటువాదులు. అయితే ఒక వేళ ఏదైనా హత్య వెనుక ఉగ్రవాదులు ఉన్నారని తెలిస్తే కశ్మీర్ లోయలో కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రజలు వారి పని వారు చేసుకుంటున్నారు. స్థానిక పత్రికలు వీటిని ప్రధాన పేజీల్లో ప్రచురించేందుకు ముందుకు రావు.
ఆర్టికల్ 370 రద్దుతో...
2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరి మఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి ఉగ్రకార్యకలాపాలపై బలగాలు ఉక్కుపాదం మోపాయి.
1989-90లలో ఇలాంటి రాజకీయ హత్యలకు తామే కారణమని ఉగ్రవాదులు ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
1989 నుంచి ఇప్పటివరకు భారత్కు మద్దతు పలికిన 5 వేల మందికి పైగా నేతలు హత్యకు గురయ్యారు. కొంతమంది ఈ సంఖ్య 7 వేలకు పైనే అని అంచనా వేశారు.