మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా.. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు లబ్ధిదారులు పోటెత్తారు. కొవిన్ డిజిటల్ వేదిక ద్వారా 2.45 కోట్లకు పైగా మంది.. టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 28న 1.37 కోట్లకు పైగా మంది రిజిస్టర్ చేసుకోగా.. ఏప్రిల్ 29న 1.04 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పింది. మరోవైపు... ఇప్పటివరకు 15.22 కోట్లు టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
వ్యాక్సినేషన్ లెక్కలు ఇలా..
- శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 22,43,097 సెషన్ల ద్వారా మొత్తం 15,22,45,179 టీకా డోసులు పంపిణీ చేశారు.
- గురువారం కొత్తగా 22,24,548 లక్షల టీకా డోసులు పంపిణీ చేశారు.
- 93,86,094 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోసు తీసుకోగా.. 61,91,118 మంది రెండో డోసు తీసుకున్నారు.
- 1,24,19,965 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కరోనా టీకా మొదటి డోసు తీసుకన్నారు. 67,07,862 మంది రెండో డోసు తీసుకున్నారు.
- 60 ఏళ్లు పైబడినవారిలో 5,19,01,218 మంది.. టీకా మొదటి డోసు తీసుకోగా.. 1,04,41,359 రెండో డోసు తీసుకున్నారు.
- 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5,17,78,842 మందికి టీకా మొదటి డోసు అందించగా.. 34,17,911 మంది.. రెండో డోసు తీసుకున్నారు.
- మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, బంగాల్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, కేరళ, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 67.08 శాతం టీకా పంపిణీ జరిగింది.
ఇదీ చూడండి: కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..
ఇదీ చూడండి: నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు!