ETV Bharat / bharat

'రాష్ట్రాలు, యూటీల వద్ద 1.94 కోట్ల టీకాలు'

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.94కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మూడు రోజుల్లో మరో లక్ష టీకాలు అందించనున్నట్లు పేర్కొంది.

covid vaccine
కొవిడ్ టీకాలు, కరోనా వ్యాక్సిన్లు
author img

By

Published : May 19, 2021, 6:42 AM IST

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల వద్ద 1.94 కోట్ల కొవిడ్ టీకాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రానున్న మూడు రోజుల్లో మరో లక్ష డోసులు రాష్ట్రాలకు అందించనున్నట్లు తెలిపింది.

"రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తంగా 20.78 కోట్ల కొవిడ్ టీకాలు ఉచితంగా అందించింది కేంద్రం. దేశంలో 18 కోట్ల 83 లక్షల 47 వేల 432 డోసులు లబ్ధిదారులకు అందాయి."

-కేంద్ర ఆరోగ్య శాఖ.

మే 18-31 వరకు 1.95 కోట్ల టీకా డోసులు రాష్ట్రాలకు, యూటీలకు అందించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:కూలిన 15 అడుగుల గేటు- ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.