ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల పరిస్థితిపై నేడు సీడబ్ల్యూసీ భేటీ

రానున్న ఎన్నికలు, లఖింపూర్ ఘటన తదితర అంశాలే ప్రధానంగా నేడు సీడబ్ల్యూసీ (congress working committee meeting) సమావేశం జరగనుంది. కొత్త కాంగ్రెస్ చీఫ్‌ను ఎన్నుకునే షెడ్యూల్‌పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

congress
ఆ రాష్ట్రాల పరిస్థితిపై నేడు సీడబ్ల్యూసీ భేటీ
author img

By

Published : Oct 16, 2021, 5:01 AM IST

సంస్థాగత ఎన్నికలు, రాబోయే శాసనసభ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన తదితర అంశాలే ప్రధాన ఏజెండాగా నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (congress working committee meeting) జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రశ్రేణి నేతలంతా పాల్గొనే ఈ సమావేశంలో.. అనేక సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్థాయి అధ్యక్షుడు లేనప్పుడు పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలియటం లేదంటూ కపిల్ సిబల్‌ జీ-23 నాయకుల ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో...ఈ సమావేశం (congress working committee meeting) ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త కాంగ్రెస్ చీఫ్‌ను ఎన్నుకునే షెడ్యూల్‌పై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 22 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 2021 జూన్ నాటికి నూతన అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుందని అధిష్ఠానం నిర్ణయించింది. అయితే కొవిడ్ వల్ల మే 10న జరగాల్సిన సీడబ్ల్యూసీ సమావేశం వాయిదా పడింది. అక్టోబర్ 3 న జరిగిన లఖింపూర్ ఖేరీ ఘర్షణతో పాటు పలు రైతు సమస్యలపై పోరాటం చేసే విధివిధానాలపై కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి : సింఘు 'హత్య' కేసులో లొంగిపోయిన నిందితుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.