ETV Bharat / bharat

సాగు చట్టాలపై విపక్షాలు గరం- భాజపా ఎదురుదాడి

పాలక, విపక్షాల మధ్య రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. నిరసన చేస్తున్న రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రోడ్లపై మేకులు అమర్చడం, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని హితవు పలికాయి. ఎదురుదాడికి దిగిన భాజపా... విపక్షాలు సాగు చట్టాలపై తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించింది. తమ మేనిఫెస్టోల్లోనూ ఇదే తరహా చట్టాలను ప్రస్తావించాయని గుర్తు చేసింది.

Rajya Sabha LIVE: Discussion on President's motion of thanks
రైతు నిరసనలపై విపక్షాల గరం- భాజపా ఎదురుదాడి
author img

By

Published : Feb 4, 2021, 2:40 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. మంత్రులు ఏకభాషణ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తాయి. వంతెనలు నిర్మించాల్సిన సమయంలో.. రైతులు ఆందోళన ప్రాంతాల్లో రహదారులపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వంటివి చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా.. విమర్శలను కేంద్రం దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు.

"చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. రైతుల బాధలను అర్థం చేసుకోండి. కఠినమైన శీతాకాలంలో మీరు నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్లపై కందకాలు తవ్వారు. ముళ్ల తీగలు, మేకులను రహదారికి అడ్డంగా అమర్చారు. నేను దేశ సరిహద్దులోకి వెళ్లాను. ఇలాంటి దూకుడైన విధానాలు భారత్​లోకి వచ్చిన పొరుగుదేశాల పట్ల చూపించడం లేదు."

-మనోజ్ కుమార్ ఝా, ఆర్జేడీ ఎంపీ

పాప్​స్టార్ రిహానా చేసిన ట్వీట్​పై స్పందించిన ఝా.. ఒక్క ట్వీట్ వల్ల ప్రజాస్వామ్యం బలహీనంగా మారిపోదని అన్నారు. భాజపా గత ఎన్నికల్లో 303 స్థానాలు గెలవడానికి కారణం రైతులేనని, కోల్డ్ స్టోరేజీల వ్యవస్థను నియంత్రించే వారివల్ల కాదని పరోక్షంగా కార్పొరేట్ వర్గాలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

రైతులను ఖలిస్థానీ, నక్సల్స్, పాకిస్థాన్ ఏజెంట్లుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మనోజ్ కుమార్ ఝా. విమర్శలను వినే ఓపిక ప్రభుత్వానికి నశించిందని, మరుగుదొడ్ల సదుపాయాలను తొలగించారని అన్నారు. కనీస మద్దతు ధరకు 2006లోనే బిహార్​ చరమగీతం పాడిందని, ఇప్పుడు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులే తప్ప రైతులు లేరని చెప్పారు. ఇప్పుడు కూలీలను సరఫరా చేసే స్థితికి చేరిందని, పంజాబ్, హరియాణాను సైతం ఇదే విధంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

అది నియంతృత్వమే: కాంగ్రెస్

అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. పెద్ద నోట్ల రద్దు నుంచి.. సీఏఏ వరకు ప్రతి నిర్ణయం ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ అని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులుగా మారారని చెప్పుకొచ్చారు.

సాగు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలుగా అభివర్ణించిన ఆయన.. భారతీయ కిసాన్ సంఘ్ సైతం పలు నిబంధనలను వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను విప్లవంగా పరిగణిస్తే.. అది నియంతృత్వమే అవుతుందన్నారు.

గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్లను తీవ్రంగా ఖండించారు మాజీ ప్రధాని దేవేగౌడ. అయితే, హింస వెనక సంఘవిద్రోహ శక్తుల ప్రమేయం ఉందని.. అందుకు రైతులు కారణం కాదన్నారు. రైతులను శిక్షించకూడదని కోరారు. నిరసన ప్రాంతాల్లో బారికేడ్లు, మేకులు, ముళ్ల కంచెలు వేయటం వల్ల ప్రయోజనం లేదని సూచించారు. శాంతియుతంగా పరిష్కారం కనుక్కోవాలన్నారు.

ప్రభుత్వం మాట...

మూడు చట్టాలను అధికార భాజపా రాజ్యసభలో సమర్థించుకుంది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో రైతుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరోనాను కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందని చెప్పారు. సాగు చట్టాలపై రాజ్యసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. దిల్లీ సరిహద్దులో ప్రతిష్టంభనను నివారించేందుకు రైతులతో 11 సార్లు కేంద్రం భేటీ అయిందని తెలిపారు.

ఈ సందర్భంగా సాగు చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుందని ఎదురుదాడికి దిగారు సింధియా. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ మేనిఫెస్టోలోనూ ఇదే తరహా చట్టాల ప్రస్తావన ఉందన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న శరద్ పవార్... వ్యవసాయంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని రాష్ట్రాలకు లేఖ రాశారని గుర్తు చేశారు.

జ్యోతిరాదిత్య సింధియా

"విపక్షాలు తమ మాటలపై వెనక్కి తగ్గడాన్ని మానుకోవాలి. బొమ్మ పడితే నేను గెలిచినట్లు, బొరుసు పడితే మీరు ఓడినట్లు అన్న వైఖరి ఇంకెంతకాలం? దేశ ప్రయోజనాలకు ఇంకెన్ని రోజులు ఆటంకం కలిగిస్తారు?"

-జ్యోతిరాదిత్య సింధియా, భాజపా ఎంపీ

పీఎం-కిసాన్​ పథకంలో భాగంగా రైతులకు ఏటా రూ.6,000 రూపాయలను ఇస్తున్నామని తెలిపారు సింధియా. రూ.90 వేల కోట్లను పంట బీమా క్లెయిమ్ చెల్లించినట్లు చెప్పారు. అదే సమయంలో రూ. లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మరోవైపు, ఎర్రకోట ఆందోళనలో జాతీయ పతాకాన్ని అగౌరవపర్చడాన్ని ఖండించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు గైర్హాజరు కావడాన్ని తప్పుబట్టారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని దుయ్యబట్టారు.

చర్చ అనంతరం రాజ్యసభ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు వాయిదా పడింది.

ఇదీ చదవండి: 'చక్కా జామ్​' కోసం రైతులు, పోలీసుల ముమ్మర ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.